పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామవర్థన మహారాజు కథ

59


మున్నీ యెలనాగ కామిం చెనని తేలుచున్నది. అన్యాపహృతమానసియగు నీబాలను నేనెట్లు చేపట్టుదును? ఆపురుషుని నిక్కు వంబరసి వానికే యీ బాలికనిచ్చుట కర్జం" బని తలంచి "యోరాజేంద్రా ! నేనిప్పుడోక దీక్ష యందున్నాను. మీతనయను సపరివారంబుగ నావెటంగొనిచని, మాయింట వివాహంబాడెద, సెలవొసంగుఁ" డని పలుక నారాజు వల్లేయని అతని వెంట ప్రబల సేనను దాసదాసీజనులను, యమూల్యంబులగు కట్నంబులను నిచ్చి చారుమతితో బంపెను. అట్లు మహాట్టహాసంబున బయలు వెడలిన హరిదత్తుండు కతిపయదినంబులకు విదర్భకరు దెంచి యూరిబయట బసల నేర్పఱచి, సత్రంబుననున్న వసంతునకు వార్తనంప నాతఁడరు దెంచి జఱిగిన వృత్తాంతం బెల్ల నాకర్ణించి, “ మిత్రమా! నీవిట నుండి చనిన కొన్ని మాసములకు జగదేక సుందరి కొక దేదీప్యమానుండగు కుమారుండుగలిగెను. అంత నీయల రేడు లోకాపవాదంబునకు వెఱచి, నీపోబడినరయుతలంపున, నన్ను బిలువనంపి ప్రశ్నింప నీవేహరిదత్తచక్రవర్తి వనియు, నీ వెచటనుండినదియు నే నేఱుంగననియు వాస్తవంబుఁ జెప్పితిని. అంత నారాజు నీవంటివాడు తన కల్లుం డయ్యె కదాయని తన భాగ ధేయముం గొనియాడుకోనుచు నీకై సమస్త దేశంబులకు వార్తలనంపెను. పురజనులందఱును నీరాకకానందముతో వేచియున్న వారు. యాచకులు, బ్రాహ్మణులు, కవులు, దినదినంబుకు నాకడకు వచ్చి నీ చరిత్రంబునడిగినదే యడుగుచు, విసుగు బుట్టించు చున్నారు. ఇది యిట్లుండ గొన్ని దినంబులకు పూర్వము, అచ్చముగ నీరూపు రేఖలం గల్గినవాఁడును నీకన్న నొక్కింత చిన్న వాఁడును నగుయువకుం డొకడీపురంబునకు రాగా, విలాసిని యాతనింజూచి నీవని భ్రమించి నిర్బంధంబున రాజనగరికిం గొనిపోయి రాజునకు రాజకుమార్తెకును జూపగా వారెన్ని విధంబులనో ప్రార్థించిరిగాని వాఁడు తాను హరిదత్తుఁడం గానని వాదించెను. అంత నేనాతనింగని, "రూపంబున నట్లేయున్నను ఇతఁడు నామిత్రుఁడు కాఁ"డని పల్కితిని. ఇప్పు డాతఁడు రాజప్రాసాదమునందే యున్నాడు. నీవు చెప్పిన భోజదేశ