పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

పండ్రెండు రాజుల కథలు


జనితులగు బ్రాహ్మణసోదరులు; విధివశంబుననిట్లు చౌర్యపరతం దవిలి, మహాధనసంచయంబులగూర్చి యిందునిక్షేపించిరి. ఈయమావాస్య నాడు ఏకగర్భజనితులగు నేవురు బ్రాహ్మణులను నాకుబలియిచ్చిన పుణ్యాత్మునకుఁ బ్రసన్నమగుట నా కొకదీక్షగలదుగాన నిన్ననుగ్రహించితి. మఱియు, తద్ధనసంచయం బెల్ల నీకొసంగుటయేగాక, దేవమునులకైన నలవిగాని సచ్చిదానందమహాత్మ్యము నెఱిఁగింతు నాలకింపుమని సాంగముగవంచించె.

అనంతరం బాహరిదత్తుండు కాళికావరప్రసాదలబ్ధుడే తద్దత్త ధన నిక్షేపంబుల నందే, నిక్షిప్తపఱచి, కాళిక పాదంబులకు మ్రొక్కి సెలవంది, భోజదేశంబునకరుగ, నట నారాజపుత్రికయగు చారుదత్త కళ్యాణార్ధమారాజోక మత్స్యయంత్రంబును నిర్మించి, దానిని భేదింపఁగల శూరునకు చారుదత్త నిత్తునని ప్రకటించెను. హరిదత్తుం డావింతను చూచి పోవలయునని, యాయూరనొక ఫూటకూళ్ల పెద్దమ్మనింటనిలువ, మార్గంబున నెం దేనింజను నొక దివాణపుదాసి, హరిదత్తుని నిదానించి చూచి, యానందముతో, "ఆర్యా ! బహుకాలమునకు దర్శనంబిచ్చితిరి? ఎందేగితిరి? మీరు చెప్పకుండ వెడలిపోవుటఁజూచి, మా చెలి యగుచారుదత్త బెంగ పెట్టుకొనియున్నది. మత్స్యయంత్రమును భేదించి మీరు పరిణయంబగుదురని మాచెలి గంపెడాశతోనున్నది. అట్లు నావంక తెల్లపోయిచూచెదరేమి? నేను మిదాసినగుచతురనుగానా? సాయంకాలమున మా చెలి యుద్యానంబునకు వచ్చును. దర్శనంబిచ్చెదరా? ” యని యడుగుచుండ, హరిదత్తుండాశ్చర్యపడి, తన్నుఁబోలిన వానినెవ్వనిగనో యది భ్రమించుచున్నదని తలంచి, తద్భావంబును బహిర్గతపరుపక , యప్పటికిం దగుసమాధానంబుల నొసంగి దానిని తృప్తిపఱచి పంపి, కాళికాకృపారసంబున నామత్స్యయంత్రముంగొట్టి, భోజరాజు నాతఁడే హరిత్తచక్రవర్తియని యెఱింగి మహానందమందిన చారుమతిం బరిణయంబాడుమనిపలుక తనలో, "అరరే ! దాసిమాటలంబట్టిచూడ నన్ను బోలినవాని నొక్కని నింతకు