పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

పండ్రెండు రాజుల కథలు


నేటికిగతించె; ఇప్పటికి ధన్యాత్మనై తి" నని పలికెను. అంత నాదేశపు రాజు సర్వజనులంగాంచి——"విధివిధానం బత్యద్భుతము! నే నీయనసూయ సోదరుండనగు సుమతిని. ఇప్పుడు నాకు మంత్రిగానున్న వాఁడు నాతమ్ముఁడగు ధీమతి. అనసూయ గర్భిణియైయుండుటెఱింగి మేమొకరిపై నొకరమనుమానమునంది, గృహత్యాగులమైపోయితిమి. అట్లుచనిన నేను కాశీపురంబున నోకమునీంద్రు నాశ్రయించి పరకాయప్రవేశవిద్య నెఱింగి, యాపురంబుననే నా కకస్మాత్తుగఁదారసిల్లిన ధీమతింవలన వాని నిర్ద్వేషిత్వము నెఱింగి నానిర్దోషిత్వమును వాని కెఱిఁగించి యీపురంబునకురాగా నీరాజు మరణించెను. అంతట ధీమతి విషవైద్యునివలెవచ్చి మంత్రింప, నాయాత్మ యీరోజున శరీరంబునఁ బ్రవేశించెను. అంత నీరాజు జీవించేనని ప్రజలానందించిరి 'నేను నాసోదరునే సచివునిగా నేర్పఱచుకొంటిని. కొండొకచోనాశరీరము భద్రముగనున్నది. ఈరాజ్యమును విప్రుండనగు నే నపేక్షింపనోవ——నామేనల్లునకే దీని నొసంగ సంకల్పించితిని. ఇతఁడు కొన్ని నాళ్లు నాగలోకంబునను, కొన్ని నాళ్లు కటకంబుననునుండి, యుభయ రాజ్యంబులం బరిపాలించుకోను నట్లాజ్జాపింపుమని వాసుకిని వేసుకొనియెను.

అత్యద్భుతంబగు నా సమావేశంబున కెల్లఱు బ్రమోదావహులైరి—— అన్న లంగని యనసూయ యానంద బాష్పంబులను రాల్చెను, మీన కేతనుండు మేనమామలకు నమస్కరించి వారి కోరిక ప్రకారము వర్తింతునని పలికెను. అనంతరము వాసుకి దారాసుతులను నాగలోకంబునకుఁ గోనిచని, మలయవతినొసంగి మీనకేతనుని వివాహంబు నతి వైభవంబుగ నొనరించెను. సుమతి నిజశరీరమును ధరించి సోదరునితో గలసి నిజపురంబగు ధారానగరంబున కరిగెను. అనసూయా వృత్తాంతము జగద్వ్యాప్తమైన కతన ధారానగరవిప్రులు సుమతి ధీమతులను క్షమింప వేడుకొని కులంబునఁ జేర్చుకొనిరి. మీనకేతనుండు కొన్ని నాళ్లు భూలోకంబునను, కొన్ని నాళ్లు నాగలోకంబునను వసించుచు,