పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

పండ్రెండురాజుల కథలు


గొనివచ్చి నా దాహశాంతి యొనరింపు " మని హీనస్వరంబునం బల్కుటయు మీనకేతనుం డతిసాహసంబున బయల్వెడలి, జలాన్వేషణ తత్పరుండై బహుదూరం బరిగి, జలంబులంగానక తిరిగి తిరిగి వేసరి, యదృష్ట వశంబున నందొక్కచో శీతలవిమలజలపూరితంబగు నొక్క పద్మాకరముం బొడఁగాంచి, యొక కమలపత్రంబునఁ దన్నీ రంబును గొని రానుంకించు నంతలో నొక్క నీకుంజసమీపంబున నతిసుందరంబగు నొక కాలసర్పం బాతని పాదంబులకు జుట్టుకొనియెను. తన్నాగంబునుఁ గాంచి యా బాలకుఁడు భీతిల్లక, సాహాసంబున దాని నెత్తి యావలం బాఱవేసినను, మరల మరల నా సర్పంబతి ప్రీతితో వెఱచి పారక యాతని యొడిలోనికిం జేరుకొని శరీరమునందెల్లెడలఁ బ్రాకులాడుచు, కపోలంబులను చుంబించుచు లీలావినోదంబుల నొనరింపఁ దొడఁగెను. ఇంతలోఁ దత్సమీపముననేయున్న జటాశంకరమహర్షి యాశ్రమము నుండి, శిష్యుం డోక్కరుఁడు కుశపత్రాదులంగోని కాదు. సనిధ భూముల కరుదెంచి మీనకేతన సర్పంబుల సఖ్యము గాంచి మెఱగంది సమీపమునకు వచ్చి యా సర్పంబు వదలింప, నయ్యది కొంతదూరమువఱకుం బ్రాకి చని యట నొక సుందర స్రీరూపముందాల్చి యంతలో నదృశ్య మయ్యెను. తచ్చిత్ర ప్రదర్శనముంగని విస్మితుండై యున్న మీనకేతనుఁ గాంచి, యబ్బాలవిప్రుండు——“వత్సా! విస్మితుండవు గాకుము. ఇదియొక నాగకన్యకయై యుండును. నీపై మరలుగొని యున్నది. నీవత్యంతధన్యుఁడవు! నీ చరిత్రం బేమి? ఇట్లు రాగతం బేమి"యని ప్రశ్నింప నా బాలుఁడు తన వ్రుత్తాంతం బెల్ల నెఱిఁగింప నాతఁడును జాలింగోని తన కమండలముతో నదకముం గైకొని మీనకేతనుని వెంట నిడుకొని యరణ్య మంతయు వెదకినను, అనసూయ వారికెందునుఁ గాన్పింపదయ్యెను. తల్లినిఁ గానక మీనకేతనుం డెలుగెత్తి యరణ్యము మాఱు మ్రోగఁ బిలుచుచు నేడ్చుచుండ మునికుమారుం డాతనికి ధైర్యముం జెప్పి తనగురుండగు జటాశంకరు నాశ్రమంబునకుం గొనిచని గురున కాబాలుని యుదంతం బెల్ల నెఱిఁగించెను. అంత