పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవరాత్రి కథ.

మఱుసటి దినంబున సయితము కృష్ణ పార్థులిరువును సాయంకాలమే సుఖభోజనంబొనరించి యమునా సైకతస్థలములంజేరి తాంబూల చర్వణం బొనరించు నవసరంబున, నర్జునుండు గోవిందుందిలకించి, “యో పురాణపురుషా ! తాము చెప్పిన ద్వాదశ మార్గంబులలో మొదటిదియగు, సాంఖ్యంబు నాకర్ణించి ధన్యుండ నైతిని. నేటి రాత్రి ఛాయాపురుషలక్షణ లక్షితంబగు మఱియొక పుణ్య చరిత్రము నానతీయవే"యని వేడిన నారాయణుండు మీన కేతన మహారాజు చరిత్రంబు నాకర్ణింపుమని యిట్లు చెప్పఁదొడంగెను.

3. మీన కేతన మహారాజు కథ.

శ్వేతవాహనా ! తోల్లి ——భోజమహారాజు ధారానగరముంబరి పాలించు కాలంబున, నప్పురంబున దేవశర్మాభిధానుండగు విప్రోత్తముం డొక్కఁడు విధ్యుక్తవిప్రాచార పరతంత్రుఁడై సదాహ్మణుండనం బ్రసిద్ధి కెక్కి యుండియు నొక్కనాడు నిజజనకుని యాబ్దికంబునకై సర్వశ్రేష్ఠుఁడగు బ్రాహ్మణుని భోక్తగాఁగోరి మహాకవియగు కాళిదాసుని భోక్తగా నిమంత్రించెను. తత్కారణంబున కాళిదాసుని మహిమ నెఱుంగని పామరజను లాతఁడు మత్స్యమాంసభోజియనియు, మధుపాయియనియు,వేశ్యాలోలుఁడనియు, సద్రాహ్మణుంచుగాఁడనియు, నట్టివానిని భోక్తగాఁబిలిచిన దేవశర్మ కులభ్రష్టుఁడయ్యె ననియు నిందించి, వెలివేసిరి. అప్పటికీ దేవశర్మకు, సుమతి, దీమతి యను నిర్వుఱు కుమారులును, సౌందర్యమున రతీదేవి కెనయగు, ననసూయ యనుపుత్రిక యుం గల్లియుండిరి. కులంబున వెలివేయంబడిన కారణంబున, దేవశర్మయే పుత్రులకుం బుత్రికకును సమస్తవిద్యలను నేర్పి——ప్రవీణులంజేసెను. అనంతరము కొన్ని దినంబుల కావల కాలవశంబున దేవశర్మ మృతి నొంద, దత్సతి యాతనితో, సహగమనం బొనరించి పురంబున వెలి