పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయసేనమహారాజు కథ,

15


ప్రతాపసేనుఁడు సోదరపుత్రుని గుఱితించి, యదేసమయంబని కరవాలంబున నాతనిం దెగటార్పనెంచి, బలంబుగ నాతనిశిరంబునఁ గత్తిని గుఱి చూచి విసరెను. భగవత్కృపచే నాయాఘాతంబు జయసేనుని శిరంబునకు దగులక భుజము పైఁదగుల రక్తప్రవాహంబు గాఁజొచ్చి నను జయసేనుండద్దానిని శాంతము నసహించి, "తండ్రీ! 'నేనిందు సేనానినై యున్న కారణమన విధిలేక మన సేనలతోడనే కలహింపవలసి వచ్చెను క్షమింపుము; నీవుశత్రువులచే బంధింపఁబడుట మనకులంబున కపకీర్తి కరంబగును కావున నిన్ను నేను విడిపింపవచ్చితిని, ఈయంగుళీ యంబును సాంకేతికంబుగాఁ జూపినచో భటులెవ్వఱును నిన్నా టంక పఱుపరు. పుర బాహిరంబున నీకొఱ కొక ససతాశ్వంబు నుంచితిని. దాని నారోహించి మనపురంబున కరుగుము. నీకు మారుగ నేనిందుండెడను. నాకులశీలనామంబుల నిందు నేను బహిరంగ పఱుప లేదు. గావున నీరాజు నా కుఱిశిక్షను విధించినను కులమున కప్రతిష్ఠ రాఁజూలదు.” అని పలికి యంగుళీయంబు నొసంగినంతనే మహాసహనశీలంబులును, త్యాగసహితంబులును నగు నక్కుమారుని పలుకులకుఁ బ్రతాపసేనుని హృదయంబునఁగల యీర్యానలంబెల్ల నశించి, మహావిజ్ఞాన కాంతి యద్భుతంబుగ నుద్భూతంబయ్యెను. అంతట నాతఁడటనుండి పలాయితుండగుట కంగీకరింపక, నాతనితో గొంతదడవు వినాదంబుసల్పియు జయసేన ప్రోద్పలంబున వెడలిపోయెను. మార్గంబునంగల భటుల కాతఁడు కుమారదత్తాంగుళీయముం జూపినంతనే ——భటులు నిరాటంకంబుగ వదలుటయే కాక, రణంబున నాతని ప్రాణంబుల కపాయము రాకుండ జయసేను డొనరించిన శాసనంబునుసయిత మాలకించి యట్టి సద్గుణరత్నంబగు కుమారరత్నముం జంపఁదలంచిన నేనెంత పాపాత్ముండనని తలఁగొట్టుకొని, విలపింపఁదొడంగెను. పదంపడి తద్రాత్రంబున రాజభటులు కారాగృహంబున కరుదెంచి, ప్రతాపసేనుండు పలాయితుండగుటయు, జయసేనుండు క్షతగాత్రుఁడై యుంటయుం