పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

పండ్రెండు రాజుల కథలు.


ప్రశ్నింప, జయసేనుండు విసమితాంజలియై— “రాజేంద్రా ! నేనొక నిరుపేదను.నన్ను మణీమంతుడందురు, నాది యుజ్జయినీ నగరము; పేదఱికంబుస జీవనోపాధికై యుష్మ ద్రాజ్యంబునకఱుగ నట సచివ శేఖరుండు నూతనుండ నగుట నన్నోలగంబునందుంచుకొన ననుమానించెను. అంతట గత్యంతరంబుఁగానక నాకునై నేనిటకరు దెంచి తమయాజ్ఞనందకయే రణంబునఁ బాల్గోనినందులకు మన్నింప వేడెద" నని పలికెను. ఆపలుకులువిని ఋతుధ్వజుండాశ్చర్యమునంది "యోహో! సజ్జనవరేణ్యా !అపజయశంకాసంకులిత స్వాంతులమైన మాకుసహాయమైనదటుండ నిన్ను మన్నింపవలయునా ! నీవు నరమాత్రుండవుగావు. నీవు నాయోలగ ముంగోరివచ్చుట నన్ను ధన్యుం జేయుటకుఁగాదే! నాసేనలకధినాధుండవై యుండుమని నియమించెను—— ఇది యిట్లుండ నటఁ బ్రతాప సేనుండు, జయసేనుని పోబడింగానక యాతని నెట్లయిన సంహరించినఁగాని రాజ్యమునం దనకుఁగల కంటకముతోలంగదని దురాలోచనంబొనరించి గూఢ చారులచే మణీమంతుని వ్రుత్తాంతంబు నెఱింగి, యతండేజయసేనుండని యనుమానించి వంగ దేశాధిపతితోఁ దనకుఁగల పూర్వమైత్రిం బురస్కరించుకొని ప్రచండ సేనలతోఁ గలసి వంగ దేశ ప్రభుపక్షంబున ఋతుద్వజుని పైకెత్తివచ్చెను,.ప్రతాపసేనునిరాకడంగాంచి, జయ సేనుండును రణంబునకాయత్తుండై, సేనలను మాత్రమే సంహరింపవలయుఁగాని, ప్రతాపసేనునకుఁ బ్రాణాపాయముంగల్గింపవలదని స్వసైనికుల కొనతియిడి, ప్రచండ సంగరంబాచరించి మగధరాజ సేనలంబరాభవించి ఋతుధ్వజునకు విజయముం జేకూర్పి, తద్రణంబునఁ బ్రతాప సేనుండు సైనికులచే బంధింపఁబడ, ఋతుధ్వజుండాతని గారాగారంబుననుంచెసు, పితృభక్తిపరాయణుండగు జయసేనుండు పితృవ్యునకుంగల్గిన పరాభవముంగని సహింపఁజాలక, యానాటి నడురేయి, చద్మవేషముందాల్చి పితృవ్య బంధిత కారాగారంబున కరిగి, యటఁగాపుండిన భటునిఁ గార్యాంతరమున నెటకే నంపివేసి, తలుపులం దెఱచుకొని, పితృవ్యుని చెంగటికేగి నిలిచెను.