పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

పండ్రెండురాజుల కథలు


బాలాలలామము, మందగమనంబున వెలికరుదెంచి, పరిచారికాజనంబు కేలూతలొసంగ, దేవీసాన్నిధ్యంబునఁ దాఁదెచ్చిన పూజాద్రవ్య ఫలాది కోపహారంబులనుంచి ధూపదీపనైవేద్య పూజాదుల నబ్భవానీదేవి నర్చించి, నిమీలితలోచనియై బద్ధాంజలియై కొండొకతడవు మానస ధ్యానంబుగావించి, మగిడి సఖీజనంబులతో గలసి, యలయంబు వెల్వడి యాందోళికారూఢయై పట్టణాభిముఖంబుగ నరిగెను. గుప్తప్రదేశంబున నిలచి యక్కాంతాజనం బొనరించిన కృత్యంబుల నెల్లం దిలకించుచుండిన జయసేనుండు మహాద్బుత చేతస్కుండై —— "ఓహోహో! ఈసుందరాంగి యెవ్వతెయైయుండును? ఇదియొక వేళ మానవకాంతగాక దేవకాంతయై యుండునా? కాదు. కాదు —— దేవకాంత లనిమిష లని విందుము గదా! అట్టి లక్షణంబీ నారీతిలకము నెడంగానమే! —— ఇది విద్యుల్లతకాఁబోలును; విద్యుల్లతయైనచో నిలుకడయుండదుగదా! కాకయిది చంద్రబింబమేమో! చంద్రబింబమునం గళంకముండుఁగదా! ఈ బాలిక యందు కళంక మెక్కడిది? కావున నిదియొక రాజపుత్రికయగుటయే నిక్కము. ఇది యేరాజ్యమో! ఏపట్టణమో నేనెఱుంగినైతి. ఈమె యొకవేళ యీ దేశాధీశ్వరుని తనయకాఁగూడదా! ఔను, అందుల కేసందియంబును లేదు. ఈమె యీ దేశపు రాజకుమారితయే! క్షణమాత్రంబున నీయన్నులమిన్న నన్ను చిత్తజుని నారాచంబుల భారింబడవైచిచనియె. నేనీ దుస్సహంబగు మదన తాపంబు నెట్లు సైరింతును! యేదియెటున్నను తోలుదోలుత నిది యేరాజ్యమో కనుంగొనవలయు ననితలంచి, యాలయంబును వదిలి పురప్రవేశం బొనరించి యదిమత్స్య దేశంబనియు, నబ్బాలికి మత్స్య దేశాధీశుని నందనయనియుఁ బురజనుల వలన నెఱింగి, తన మనంబున, "తొల్లి మత్స్య దేశాధీశున కొకానొక రాజన్యునితోఁ గలిగిన ప్రచండ సంగరంబున మజ్జనకుండీరాజునకు సహాయం బొనరించుటయేగాక యాతని ప్రాణంబులను సయితము రక్షించెననియును తత్కారణంబు నీరాజు మాకుటుంబమున కత్యంత