పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

పండ్రెండురాజుల కథలు


కొన్ని దినంబులు జయసేనుని రాజ్యభ్రష్టునిఁగా నొసరింప నంత్య సంకల్పంబు నొనరించి యొక్క నాడు జయసేనుం దనదఱికిఁబిలిచి "కుమారా! ఏ కారణంబుననో రాష్ట్రీయజనంబున కనేకులకు నీపైఁ గ్రోధముగల్లి యున్నది. వారి క్రోధంబు చల్లాఱునంత దనుక నీవే యన్య రాష్ట్రంబుననైనఁ దలఁదాచుకొని, దేశ కాలస్థితు లనుకూలించిన పిదప నాయాజ్ఞ నంది మగుడ నిందురాఁదగును. నిన్ను విడుచుట యనిన, నాకును మిక్కిలి విచారంబు గల్గుచున్నయది. ఐనను నేనిందు నీ కెట్టి సహాయమునుఁ జేయనేఱని న్యర్ధుండ నైతిని. ఇప్పట్టున నిట్లు నేనొనరింపనేని దుర్మార్గులగు రాష్ట్రీయ జనులు నన్నును రాజ్యమునుఁ గూడ మ్రింగి వేయ సంకల్పించియున్నవారు; కావున నీవు రేపటి దినంబున నాయాజ్ఞను పాలింపుము. నీ నిర్గమన వ్రుత్తాంతమును విషయసేనునకైన నెఱింగింపవల" దని శాసించినఁ బితృభక్థిపరాయణుండగు జయసేనుండు వినయ వినమితమస్తకుండై పితృవ్య శాసనంబు నౌదలందాల్చి —— “తండ్రీ ! నాజనకుని యనంతరంబున, నీవేనా జనకుఁడవు. నీశాసనము నాకు శిరోధార్యము. మనము శ్రీరామచంద్రుడు జన్మించిన సూర్యవంశంబుననే జన్మించుటం జేసి యామహాత్ముని ప్రవర్తనమే మనకును మార్గదర్శంకంబై యున్నది. కావున నాతండెట్లు పితృశాసనంబును నిర్వర్తించెనో నేనును, నట్లే నీశాసనంబునుఁ బాలింపరేపే ప్రవాసినై పోవుదును. నాకు సెలవి” మ్మని పలికినఁ బ్రతాపసేనుం డానందించెను. జయసేనుండా మఱునాటి వేఁగుజూముననే, చిర కాలావాసమగు స్వజన్మస్థానమును, తనకు విధేయుండై ప్రేమభాజనుండగు ముద్దుతమ్ముని వినయసేనునివదలి గమ్యస్థాన నిర్దేశం బొనరించుకొనకయే పురముంబాసి యొక మహారణ్య మార్గంబునఁబడి నిర్గమింపసాగెను. అట్లు మహాభయంకర నిబిడంబగు నరణ్య మార్గంబున నరుగుచు, నారాజకుమారుండు తన నెమ్మనంబున, “దైవమా! నేనెందరుగు వాఁడ! మగధ దేశాధీశ్వర నందనుండనని యెవ్వఱితో నేమని చెప్పుకొందును! ఇట్లు నీవు రాష్ట్ర త్యాగినై రాగతం