పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విష్ణువర్ధన మహారాజు కథ

109


లాషము నెఱిఁగించిరి. ఆమాటలువిని యోగిని యిట్లనియెను.——“అమ్మాయీ! నాకుగల్గినసందేహమే, నీకునుఁ గల్గియున్నది. ఇటులే నేనును కామమును త్యజించి వివాహమునొల్లక, యావిషయమై గురు నితో వాదింపగా ఆమహాత్ముఁడు నాతో “సోదరీ! కామ మేకాంత రూపమై జనించియున్నది. కాంతా కామముల కభేద ప్రత్తిపత్తియైయుండ, కాంత కామమును ద్యజించుననుట తననీడను తాను తప్పించుకొనఁగోరునట్లే యగును. కాంత యర్హుండగు పతిని వరించి, గృహస్థాశ్రమమున నుండియే, ఇహపరములను రెంటిని సాధింపఁదగునని ధర్మశాస్త్రంబులు నుడువు చున్నయవి. సంసార త్యాగినియగు కాంత సద్బుద్ధిగలదయ్యును, లోకనిందఁ జెందును. కావున సంసారిణివగు" మని బోధించెను, అంతట, నేను, “స్వామీ! కామము లేని కాంత, అతి కామి యగు పురుషునితో నెట్లు సంసారసౌఖ్యముఁ జెందఁగల”దని ప్రశ్నించితిని. అందులకు గురుఁడు యుక్తి యుక్తముగా, “అందులకే యర్హుండగు పతిని గ్రహింపుమని యుపదేశించితిని. కామము లేనికాంత కామరహితుఁడగు కాంతునే, వరింపఁ దగినది. లోకోపకారార్థము ననుబోటి యతులు కామరహితులగు సత్కాంతల ననుగ్రహించుచుందురు. తొల్లి యరుంధతీ వసిష్ఠులును——అనసూయాత్రిమహర్షులును, ఇట్టి యనుకూల దాంపత్యమునే కాంచి" రని పలికెను. అందుపై— నాకు వివాహమాడు కోరిక జనించియున్నది. గురుఁడు నాకు పితృతుల్యుఁ డగుటచే నీయనం జేపట్టుట దోషమని యర్హుండగు పతికొఱకై యన్వేషించు చున్న దానను. నీపై నీమహాత్మునకు సదభిప్రాయ మిదివరకేకలదు. నీకును ఈయనకు నావలె—— గురుశిష్య సంబంధము లేదుగావున, లోకోపకారార్థము, నిన్ను వరింప నిరాకరింపఁడు, నేనెట్లో యోప్పింతును . నీయభిలాషముం దెలుపుమనిన, సావిత్రి యొక్క మాఱుగఁదన, హృదయమును మరల్చుకొని యేదియుం జెప్పనేరక డోలాందోళిత హృదయయైయుండ, మంజరియు యోగినియు బలవంతపరచి యామె నొప్పించిరి.మూఁడవనాఁడు లోకోపకారార్థమై ఆయతి, సావిత్రిని గాంధర్వవిధిం