పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

పండ్రెండు రాజుల కథలు.


ప్రియుండును స్వయముగా వీణలం జేయువాఁడును, నని యాలకించి యటకరిగి——అతనివీణనే గైకొని తనగాన నైపుణ్యంబున నాతని మెప్పించి తన చరిత్రమంతయు నాతని కెఱిఁగించి, యావీణనిమ్మని కోరినది. అతఁడు దానిని మెచ్చి యావీణనిచ్చుచు నూరక పరిహాసంబునకు, దీని కేమి వెలయిత్తువనియడుగ, నాబోటి తనకు సావిత్రియిచ్చిన రత్న హారంబు నిత్తు ననిపల్కి——వీణం గైకొని దాని నీయఁబోవ రాజకుమారుఁడు వారించుచు “బోటీ! క్షత్రియుఁడు తనకుఁగల్లెనేని దానము సేయుటకర్జముగాని, వీణలను అమ్ముకొనుట యగౌరము కావున నాకిదివలదు. నీవేగైకొ"మ్మని పల్కెను. కాని, యావీణావతి తొలుతనిచ్చిన దానిని మఱల గైకొన ననుమతింపదయ్యెను. తుదకాతండా రత్న హారమును వెలయిచ్చి కొనెను. కాని, వీణావతి సావిత్రి గుణగణంబులను వర్ణించి చెప్పినప్పటి నుండియు నాతనిహృదయ మా మదవతిపై, గాఢముగఁ దవుల్కొనియెను. అంత నొక్క దినంబున నాతఁ డీ వృత్తాంతము నెవ్వరికిం దెలుపక ,చిత్త స్థైర్యంబుచే యొక వారువంబు నెక్కీ యిల్లువదలి యరణ్యంబులం బడిపోవుచుఁ దుదకు, నారాయణుండను నోక మహర్షియాశ్రమముం గాంచి, తదీయాశ్రమసందర్శనమాత్రంబున, చిత్తంబు వైరాగ్యాయత్తం బగుటయు, నామునీంద్రుని పాదంబుల కెరగి మోక్షమార్గంబు నుపదేశింపుమని ప్రార్థింప, బాల్యావస్థయందున్న యారాజపుత్రుని చిత్తంబు మరల్పం బ్రయత్నించియు నాజడదారి విఫలమనోరధుండై—— "కుమారా! అచల పరిపూర్ణతత్త్వంబు నెఱింగించెద నాకర్ణించి తన్మార్గంబునఁ దరిం పుమని యుపదేశించెను.

విష్ణువర్ధనుం డచలబ్రహ్మంబు నెఱింగి, కొన్ని దినంబులటనుండ, నొకనాడు, నారాయణ మహర్షి యాతనింజీరి, కుమారా! లోకంబునఁ జతుర్విధాశ్రమంబులందును గృహస్థాశ్రమం బత్యుత్తమంబని పెద్దలు చెప్పుదురు. నీవింకను బాలుండవు గాన నీకీయాశ్రమంబీప్రాయంబున, ననుచితంబై యున్నది; నీయిచ్చవచ్చిన కన్యారత్నంబు నేరుకొని గృహ