పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

పండ్రెండురాజుల కథలు


మాడి, రాజముఖి యజ్ఞాతవాసదీక్ష దీర్పుమని ప్రార్థించిరి. రాజ శేఖరుం డందుల కనుమతించి, వసిష్ఠమహర్షికడ సెలవు వేడుకొన నామునిసాధుఁడు రాజశేఖరుని దీవించి, ఆతనికి సమంత్రకంబులగు వివిధాస్త్ర శస్త్రంబులనొసంగి, పురుషాకృతితో నున్న అనంగసేననుగూడ తోడుగా నొసంగి నేపాళ దేశంబున కంపెను. రాజశేఖరుఁడు మునిదత్తంబులగు నాయుధంబుల బలంబువలన, యక్షసైన్యంబుల దైన్యంబునొందించి, ప్రచండ సంగ్రామం బాచరింప, యక్షనాధుఁడు, దీనుఁడై సంధి కిచ్చగించెను. తత్సమయంబునకు వసిష్ఠ నారడు లటకువచ్చి——యక్షేశ్వర రాజశేఖరులకు సంధి యొనరించి, నిజ వృత్తాంతముల నెల్లం దెలిపి, నిజమగు ననంగసేనను, చిత్రసేనను రాజశేఖరునకిచ్చి వివాహం బొనరించుటేకాక, రాజముఖిని యక్షేశ్వర పుత్రుఁడగు చిత్రగ్రీవునకిచ్చి——పెండ్లి చేయించి, యాదినంబు మొదలు, నేపాళ, కాశ్మీర దేశాధీశ్వరులకు మైత్రిగల్గునట్లు సమ్మతింపఁ జేసిరి. రాజశేఖరుం డిరువురు భార్యలతోడను, కాశ్మీర నేపాళ భూములం బాలించుకొనుచు, నప్పుడప్పుడు యక్షలోకంబునకరిగి చెల్లెలిని బావమఱందినిఁ జూచివచ్చుచు, పుత్రపుత్రికా లాభముం గాంచి, బహువర్షంబులు భూతలంబున మహేంద్ర వైభవంబుల ననుభవించెను.


పండ్రెండవనాటి రాత్రికథ

పండ్రెండవనాటి రాత్రి యధావిధంబుగా కృష్ణార్జునులు, యమునాసై'కత భూములం దాసీనులై యున్నతరి, పొర్ధుఁడు గోపాలుం దిలకించి, పండ్రెండవదియగు, నచల పరిపూర్ణతత్త్వ ప్రభావంబు నెఱిఁగింపు మని ప్రార్థించుటయు, నానంద నందనుఁడు, పరమపవిత్రంబగు, విష్ణు