పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరమహారాజు కథ

103


పుత్రిక యందుండుటయుం గని, యచటివారు చిత్రసేననే యనంగసేననుగా దలంచుచున్నారు!——స్వయంవరమున చిత్రసేన రాజశేఖర ప్రతిమను వరింప తొలుత నాగ్రహించియు నేపాళ భూపతి, యిపుడు పశ్చాత్తప్లుఁడై రాజశేఖరునకే నిన్ని చ్చెదనని అనంగసేనగా భావించి, చిత్రసేనతోఁ జెప్పెను. ఈలోన, రాజశేఖరు నన్వేషింప నాతని సోదరియగు రాజముఖి యను చిన్నది, పురుషాకృతితో నేపాళ దేశమునకు రాగా,ఆమెను రాజశేఖరునిగా నెంచి రాజు అనంగసేనగా భావింపఁబడిన చిత్రసేన నాతని కిచ్చి పరిణయంబొనరింప నిశ్చయించియున్నాఁడు! రాజశేఖరుఁడు వసిష్టాశ్రమమున కరిగి యాతనికిఁ బ్రియశిష్యుఁడై ఎఱుక, మంత్రోపదేశముం బొంది మహా మహిమను సేకరించుకొని యున్నాఁడు. విరక్తిచే నిల్లు వెడలిన అనంగసేన బాలతపసి వేషమున వసిష్ఠమహర్షి కంటఁబడగా——అతఁ డామెవృత్తాంతముం దెలిసికొని, ఆమె నెట్లయిన రాజ శేఖరునకు బరిణయ మొనరింప నిశ్చయించి పురుషాకృతితోడనే యనంగసేనను, రాజశేఖరునకుఁ బ్రియమితునిగా నేర్పరచి తన యాశ్రమంబుననే యుంచెను. యక్షేశ్వరా! ఇప్పుడు నీ తనయ అనంగసేన యను పేరం బరగుచు——నేపాళాధీశుని శుద్ధాంతమున నున్నయది ” అని వ్రుత్తాంత మెల్ల నెఱింగించి తనదారి నరిగెను.

నారదుని పలుకుల నాకర్ణించి, యక్షేశ్వరుడు, మితి లేని యక్ష సైన్యములం గూర్చుకొని మహాటోపంబుమీర నరుదెంచి——నేపాళ రాజధానిని ముట్టడించెను. రాజశేఖరాన్వేషణార్థము, దిలీపభూపతి చేఁ బంపఁబడిన చారులును, రాజముఖిచేఁ బంపఁబడిన చారులును, వసిష్ణాశ్రమ పరిసరములం గలసికొని, తమతమ వృత్తాంతము నోకరికొక, రెఱిఁగించుకొని, తదాశ్రమాంతరమునందే, తమ రాజకుమారుని సయితము గుఱ్తించి——నేపాళ రాజ్యంబున రాజముఖి పురుషాకృతితో నున్న తెఱంగును, యక్షరాజు నేపాళ రాజధానిని ముట్టడించిన విధంబునుం దెలిపి, నేపాళ రాజ్యముం గాపాడి, యనంగసేనం బాణిగ్రహణ