పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

పండ్రెండురాజుల కథలు


పశ్చాత్తప్తుఁడై——యనంగసేనను చేరంజీరి, “బిడ్డా! నీవు నా కేక పుత్రికవు. నాకా పురుషసంతతి లేదు. నీవా శత్రురాజు కుమారుంగోరితివి. కావున నాగ్రహించి నిన్ను కష్టపెట్టితిని ఇప్పు డారాజశేఖరుండెందైన లభించునేని నిన్నిచ్చి వివాహముచేసి, యాతని కీరాజ్యము నిచ్చి యిల్లటముగా నిందేయుంచుకొన సంకల్పించి యున్నవాడ "నని పలుక నామె సంతోషించెను. రాజశేఖరుఁడే మనచేతఁ జిక్కెనని భటులు వచింప రాజతని గౌరవించి, తన సంకల్పము నెఱిఁగించి, నాకుమార్తెం బెండ్లియాడి, యిందేయుండుమని కోర, రాజముఖి వారు తన్ను తన సోదరునిగా భ్రమించుచుండిరని యాత్మ నెఱింగి గుట్టు బట్టబయలు సేయక, వల్లేయని యప్పటికి రాజునకు దన సమ్మతి నెఱిఁగించి, రహస్యముగ దన సంగతి సనంగసేనకు మాత్రమెఱిఁగించి, వివాహముహూర్తము దూరముగఁ బెట్టించి యీలోన గూఢచారులనంపి రాజశేఖరు నుదంత మరయుచుండెను. ఒక దినంబున యక్షలోకాధీశ్వరుఁడగు చిత్రరథుని పేరోలగంబునకు నారదుండరిగి యతనిచే బూజితుండై "రాజా! నీవేల విచారముతోనున్నావు? నీకు కుశలమా?"యని ప్రశ్నింప, నతఁడు—— "మునితిలకా! ఏమని చెప్పుదును. నాతనయ యగు చిత్రసేన, కొన్ని దినంబులనుండియుఁ గాన్పింపకున్న యది. ఏరక్కసుల బారిఁబడెనో యెఱుంగ, ఇదియే నావిచారమునకు హేతు"వనిపలుక , త్రిలోక సంచారియగు నాజడదారి చిఱునవ్వు నవ్వి——"యక్ష రాజా! విచారింపకుము. నీతనయ, యొకనాడు భూలోకమున కరిగి యందు రాజశేఖరుఁడను రాజకుమారుని వరించెను. అంతకు మున్నా రాజశేఖరుని నేపాళ భూపాలుని తనయ యగు అనంగసేన వలచియు, తన జనకుఁ డనుమతింపమిం జేసి సన్యాసివేషముం దాల్చి యడవులంబడి పోయెను. విధి చిత్రము వలన ఆ యనంగసేనయు——మీ చిత్రసేనయు నేకాకృతిఁగలవారగుటం జేసి, రాజశేఖర పాణిగ్రహణాభిలాషంబున నీ పుత్రిక యితరు లెఱుంగ కుండ, నేపాళభూపతి యంతఃపురముం జేరెను. నిజమగు ననంగ సేన దేశత్యాగిని యైనవార్త రహస్యంబగుటయు, అనంగసేనం బోలిన నీ