పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరమహారాజు కథ.

101


మీసమురాని యొక నూతన బాలయతి, వినయముతో నాసీనుఁడై, యుంట గాన్పించెను. ఆబాలుఁడు త్రిలోక మోహన సౌందర్యశాలియై——చక్రవర్తి కుమారునిబోలె నొప్పారుచుండియు, జలధరాచ్ఛాదితంబగు శశిబింబము కైవడి కాషాయ చేలంబులఁ దాల్చియుండుటం గాంచి రాజశేఖరుఁడు పరమాశ్చర్య భరితుఁడై, ఱెప్పవ్రాల్పక, తనివిదీర వానినే చూచుచు నిలువఁబడు నంతలో వసిష్ఠ మహర్షి జపంబు చాలించి, రాజశేఖరుంగాంచి, పుత్రకా! ఈబాలయతి, మన్మిత్రుఁ డగు నొక మహర్షికి ప్రియశిష్యుఁడు. కొండొక కార్యార్థమై నాకడ కంపఁ బడినందున, నిందు కొన్నినాళ్లు వసింపఁగలవాఁడు. నీకితఁడు ప్రియ సహచరుఁడై మెలంగు" ననిపలికి యాబాలు నప్పగించెను. ఏమి కతంబుననో కాని, రాజశేఖరున కాబాలకుం గాంచినది మొదలొక యవ్యాజ ప్రేమ యుద్భవించి యాతని నొక యఱనిముసమైన నెడబాయక మిగుల సౌహార్దంబున మెలంగుచుండెను. ఇదియిట్లుండ, నట——కాశ్మీర దేశంబున దిలీపభూపతి యామఱునాడు, తన కుమారుంగానక విచారాక్రాంత స్వాంతుఁడై చతురులగు దూతల చతుర్దిశలకును వెదుకఁ బుత్తేంచెను. కాని, యంతం దృప్తిగాంచక రాజశేఖరు సోదరి యగు రాజముఖియు సోదరు నన్వేషింపఁ బురుషాకృతిందాల్చి, తండ్రి సెలవునంది బయలువెడలెను.

అట్లు వెడలిన రాజముఖి——తన సోదరున కనంగసేన పై కామంబు గల్లి యుండుటం జేసి, నేపాల రాజ్యంబునకే యరిగి యుండునను విశ్వాసంబున నటకరిగి పురోద్యానంబున నాసీనయయ్యె. ఆమె పురుష వేషమున నుండుటం జేసియు——అచ్చంబుగా రాజశేఖరుంబోలి యుండుటం జేసియు, రాజభటులామెంగాంచి, తమ శత్రురాజు కుమారుండగు రాజ శేఖరుఁడు గాఁ దలంచి, యామెను బంధించి, యవ్వార్తను రాజున కెఱిఁగించిరి. అనంగసేనుఁడు, స్వయంవరంబున కుమార్తెను నిర్బంధించిన యనంతరమున, ఆమె తన కేకపుత్రికయగుటచేత——బాధింపనొల్లక