పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరమహారాజు కథ

99


కుమారునిదిగా నెఱింగి, యాగ్రహించి, వాఁడుదక్క మణియొకని నెవ్వనినేని వరింపక తప్పదని, కూతున కసమ్మతంబుగా స్వయంవరమును సాటింపఁబంచి, రాజశేఖరు నవమానింప నెంచి, యాతని యాకృతి ననుకరించు నొక కృత్రిమ విగ్రహమును నిర్మించి, రాజకుమారుల యాసనంబులకు చివర భాగంబున ద్వారపాలకునిగా నేర్పరచియుంచెను. అనంగసేనా స్వయంవర వార్త కర్ణాకర్ణిని, రాజశేఖరుని చెవిసోకిన నతండు ప్రచ్ఛన్న వేషంబున, నేపాళ రాజ్యమున కరుదెంచుచు, మార్గమధ్యంబున నొక్కచో బహు విశాల శాఖాయుతంబగు నోక వటవృక్ష ఛాయా తలంబునఁ బరుండెను. మార్గశ్రమంబున నాతఁడు గాఢనిద్రావశుండై యున్న తరి——నర్ధరాత్రంబున, నా కాశతలమునుండి, యొక యచ్చరకన్య, భువిని విహరింప డిగ్గి——యాసుకుమారుని రూపలావణ్యాతిశయములం గని యాశ్చర్యపడి, మదనవికారంబునఁ బారవశ్యతనంది, యాతని కంచుకాంతరంబునఁ గల యనంగసేనాచిత్రపటంబునుగాంచి, యందలి రూపము మూఁడుమూర్తులఁ దన్ననుకరించి యున్నందులకు మఱింత యాశ్చర్యపడి, యనంగసేనా స్వయంవరాహ్వాన పత్రికను గని, యాతఁడటకుఁజన నున్నాఁడని గ్రహించి, యెటులైన నాతని పాణిగ్రహించు వెఱ వాలోచించుచు, నంతలో తెల్లవాఱుటం దిలకించి తన మార్గంబున, నరిగెను. రాజకుమారుఁడును తదనంతరము నిద్రమేల్కని గత నిశీధంబున జఱిగిన విషయంబుల నెఱుంగక, మరలఁదన పయనము సాగించి కాశ్మీర దేశాభి ముఖుండయ్యె.

స్వాభిలాషమునకు వ్యతిరిక్తముగ, తన తండ్రి స్వయంవరమును సాటఁ బంచుటం దలంచి స్వయంవర పూర్వరాత్రంబున, ననంగసేన, నిద్దుర లేక పరితపించుచు, ఆత్మహత్యా ప్రయత్నమునకు సయితము తెగించి యుండెను. మఱునాటి స్వయంవరో శుభకార్యంబునకు భూమండలంబునఁ గల యశేష రాజకుమారశేఖరులచేతను, నేలయీనిన చందమున నిండి పోయిన ప్రేక్షక సమూహములతోడను, స్వయంవరమంటపము క్రిక్కిఱిసి