పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

పండ్రెండు రాజుల కథ.


సుముఖమగుటకానందమునంది, అనంగసేనయను నాస్వప్న గత రాజకుమారి యేభూదారుని కుమారియో తెలియమింజేసి, భూమండలమండితులగు సకల మహీరమణుల పుత్రికా ప్రతిబింబ చిత్రముల సేకరింప, చారుల నలుదిశలకును బంపెను——

ఇట——రాజశేఖరుఁడు బలెనే, యట——ననంగసేనయు, మఱుసటి దినంబునఁ దన వ్యధను, చెలుల కెఱింగించుచు, రాజశేఖరుని యంగుళీయముం జూపి, యతనిందక్క వేఱుపురుషుం జేపట్టనోపనని దృఢతర ప్రతిజ్ఞా బద్ధయైయుండెను. దిలీపునట్లే——నేపాళ భూపాలుఁడగు ననంగసేనుఁడును, నిజకుమారికాభిప్రాయంబు నెఱింగి, సకల భూనాధకుమార ప్రతిబింబములం గొనితేర, సమర్ధులగు చారులనంపెను——కొన్ని దినంబుల కావల, సంపాదిత సర్వరాట్పుత్రికావటంబులను దిలకించి, యందుగల——యనంగసేన పటంబు నేరి, యిదియే నాహృదయేశ్వరియని నిరూపించి, రాజశేఖరుండద్దానిం దన మ్రోలకంపెను. దిలీవభూపతి యాపటముం దిలకించి, యద్దాని రెండవ వైపున వ్రాయబడిన వృత్తాంతమువలన, నాసుందరి, తనకు గర్భవిరోధియగు నేపాళ భూపాలునందనగా నెఱింగి, మహాగ్రహపరవశుండై——తనయుని జీరి, కాశ్మీర నేపాల భూపతులకు తర తరంబు లాదిగాఁగల్గు బలవద్విరోధ వృత్తాంతమును విశదీకరించి, యాసుందరిపైఁ గల డెందంబును మరలించుకొని వేఱోకరాకుమారిం గోరుకొమ్మని బోధించెను. రాజశేఖరుఁడు, తండ్రి మాట కెదురాడఁ జాలకయు, అనంగసేనను మఱువఁజాలకయు, ఆందోళిత స్వాంతుఁడై యుండెను.

అట——నేపాళ దేశాధీశ్వరుండును, చారులచే సేకరింపబడిన సమస్తరాజపుత్రుల చిత్రపటంబులను తన పుత్రిక యగు ననంగసేనకడ కంప——నాయెలనాగయు, నందలి రాజశేఖరుని చిత్రంబునేరి నిరూపించి, యాతఁడే తన వరుండనియు, నతనింగాక యన్యునివరింపజాలననియును, నొక్కి వక్కాణించెను. అనంగసేను డాపటము తన శత్రురాజన్యుని