పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అణుజునై యెగిరితి రహస్యాంబరమునఁ;
బిన్న పెద్దల శుశ్రూషవేత్త నైతిఁ;
గాని, లోగుట్టూఁదెలుపు నొక్కనిని గనను;
మఱలివచ్చితిఁ బోయిన మార్గమందె.
    
సతముఁ దత్త్వవిచారంబు సలిపిసలిపి
మూలసూత్రంబు నెవరైన ముట్టినారె?
నేఁడు నిన్నట్లు; రేపును నేఁటియట్లు;
అందనిఫలంబు చేచాఁప నందుటెట్లు?
      
అఖిల శాస్త్ర పురాణ తత్త్వాబ్ధు లీఁది
పరమ విజ్ఞానదీపమౌ పండితుండు
కాళరాత్రిని మార్గంబు గానలేక
యల్ల మామూలుకథఁ జెప్పి యంతరించు!

జీవితంబెల్ల బహుశాస్త్ర సేవలందుఁ
గడపితి, రహస్యములు చాల గ్రాహ్యమయ్యె;
నిప్పుడు వివేకనేత్రంబు విప్పిచూడఁ
దెలిసికొంటి నాకేమియుఁ తెలియదంచు.
  
మనకు ముందేఁగినట్టి యా మాన్యులెల్లఁ
బ్రబల గర్వాంధ నిద్రాబద్ధులైరి;
నెలఁత, మధువాని నావల్ల నిజము వినుము;
వారు చెప్పిన చదువెల్ల వట్టి కల్ల!