పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రతిదినముం దలంచెదను రాత్రులయం దనుతాపమొంద; సం
తత మధుపాన భోగపరతన్‌ మఱునాఁటికి మార్చికొందు; నీ
వితముగ కొన్నినాళ్ళు కడవెళ్ళ వసంతమువచ్చె నిప్పు డా
తత సుమనోభరంబుఁ దలఁదాలిచి; నే వగపిల్లు టెట్లొకో!

తారాశుక్తులు రాల్చినట్టి జిగిముత్యాలట్లు పూఱేకులన్‌
జాఱెన్‌ సన్నని మంచుతుంపురులు; వాసంతోదయశ్రీకిఁ గం
తారత్నం బనువైన నెచ్చెలిగ నుద్యానంబునం దోఁచె మి
త్రా, రారమ్ము సుఖింపు, మీయదను వ్యర్థంబైన రాదెన్నడున్‌.