పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. పొలములపూలగాలి వలపుల్‌ కలఁబోయుచువీచె; గాజు గి
న్నెలఁ జిఱుచేదుపానకమునింపుము; నశ్వరమైన ఈస్థితిం,
దెలియుమ యీక్షణం బెరవుదెచ్చిన సొమ్మని; జాఱఁబుచ్చినం
గలికి, మఱెప్పుడిట్టితఱి క్రమ్మఱరాదు; నిజమ్ము; నమ్ముమా!

5. కనుగొమ్మా నినుబోలె రాగవతియై కాంతిల్లెఁ పూర్వాశ, మో
మున నీలాలక రేఖలొత్తుచు, నిశాభుక్తావశేషాసవం
బును సీసాలకు నింపి యొక్కసరకంబు\న్‌ ముంచియందిమ్ము; ద
క్కని యారేపటి మాటలేటి కనుభోగ్యంబైన నేఁడుండఁగ\న్‌.

6. తరుణార్కుండు సువర్ణవాగురులచేతం బాదుషాహా దివం
భర హర్మ్యోపరి గర్భగోళ శిఖరవ్రాతంబు బంధించె; వా
సర కైఖుస్రువు రక్తిమాసవము నాశాపాత్రఁ బూరించె; ని
త్తఱి ఘోషించె మునాదియెల్లరకుఁ బ్రాతఃపానగూఢార్థముల్‌.