పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

41


ఎపిక్యూరసు, ఖయ్యాముల భావములు చాలవజకు పరస్పర విరుద్ధములు. ఎపిక్యూరసు నిరీశ్వరవాది, ఖయ్యాము ఈశ్వరవాది. అతఁడు విధిలేదని చెప్పను, ఇతఁడు మన సుఖదుఃఖములు విధినిర్ణీత ములని సిద్ధాంతీకరించును. అతఁడు ఖగోళశాస్త్రము కల్పితమనుసు, ఇతఁడు గొప్ప జ్యోతిశ్శాస్త్రజ్ఞుఁడు. మరణానంతర జీవితములేదను విశ్వాసము ఇరువురకు సమానమే. ఖయ్యాము ఎపిక్యూరస్ సిద్ధాంత ముల నొకటి రెండు తప్ప అన్నింటిని అంగీకరింపలేదు. ఒక్క ఈశ్వరుని విషయమందు తప్ప చార్వాక మతమున కును, ఖయ్యాము మతమునకును ఏలాటి భేదముండదు. ప్రబోధ చంద్రోదయ నాటకమున ద్వితీయాంక అంకమున మహామోహునకు చార్వా కునకు జరిగిన సంభాషణమునందు చార్వాకమతము వివరింపఁబడి నది. బ్రహ్మశ్రీ వడ్డాది ' సుబ్బరాయకవిగారి ఆంద్రీకరణమునుండి ఉదాహరణ గ్రహించంబడినది. "సర్వదా లోకాయతమే మనందగినది; దానియందు బ్రత్యక్ష మొక్కటియే ప్రమాణము. పృథివ్యత్తేజో వాయువులె తత్త్వములని, అర్థకామములే పురుషార్ధము లని, భూతములే జ్ఞానజనకములని, పరలోకమన్నది. సున్నయని, మరణమే మోక్షమని........... వాచస్పతి............ తచ్ఛా స్త్ర మును........... రచించిన పోఁడయ్యెను.” చార్వాకుల అభిప్రాయ ములతో సరిపోవు భావములుగల పద్యములెన్నియో “పానశాల” యందున్నవి. ఖయ్యాము మతము చిత్రమైనది. ఆత్మ ఈశ్వరాంశము కావున ఈశ్వరవాదులందలు ఆత్మయున్నదని నమ్ముదురు. నిరీశ్వరవా దులు ఆత్మశరీరమువలె నశించునని చెప్పుదురు; ఖయ్యాము మాత్రమె ఈశ్వరుఁడున్నాఁడనియు, ఆత్మలేదనియు చెప్పియున్నాఁడు. “దేవుడే సృష్టి కర్త, కుమ్మరి కుండలు చేయునట్లు ఈశ్వరుఁడు లోకమును సృజించును. కుండపగిలిన వెనుక మన్ను మంటిలో కలసిపోవునట్లు ప్రాణముపోయిన వెనుక శరీరము భూమిలో జీర్ణించును.