పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40


భవించుచు నిరంతరము దైవధ్యాన లగ్నచిత్తులయి ఆత్మ పరమాత్మల ఐక్యముకొఱకు పాటుపడుచుందురు. ఎట్టిమతమైనను కొంతకాలము నకు కరుడుగట్టి ఆచారబద్ధమయి అనేక విధములగు కపట వ్యాపార ముల కాలవాలమగుచుండును; ఆధ్యాత్మిక సమస్య ఆర్థిక సమస్యగా పరిణమించును. ఖయ్యాము కాలమునాఁటికి సూఫీ' సమాజమునందు చేషధారులు బయలుదేరిరి. వారి స్వయమారోపిత పావనత్వము, వైరాగ్యము వేషధారిత్వముగ మాఱినది. ఖయ్యాము సూఫీ'లను ఎగతాళి చేయుటకోయనునట్లు వారి మత పరిభాషనే గ్రహించి సౌంప్రదాయిక సంకేతములను లౌకికార్థమున ప్రయోగించేను. దీనిని తెలిసికొనక కొందఱు ఖయ్యాము రూమీవలే సూఫీ 'యని పొరబడిరి. అయిదారు రుబాయీలు చదువగనే ఆతడు వర్ణించిన ద్రాక్షాసవము సాంకేతికము కోదని మనకు స్ఫురించును. పాశ్చాత్య విమర్శకులు కొందఱు ఖయ్యామును ఎపిక్యూర్ (Epicure) అని పేర్కొనిరి. వాడుకలో ఎపిక్యూర్. అనఁగా పరచిం తలేని భోగలాలసుఁడు. ఎపిక్యూరస్ సిద్ధాంతములు ఒకటి రెండు విష యములలో తప్ప ఖయ్యాము నమ్మకములకంటె భిన్నముగ నుండును; “శరీరము భౌతికము. ఆత్మ భౌతికమైన సూక్ష్మ శరీరము. నీటిలో ఉప్పు నీటియందంతయు వ్యాపించియుండునటుల సూక్ష్మ శరీరము (ఆత్మ) దేహమున. వ్యాపించియుండును. దేహముతోడ ఆత్మయు నశించును. మరణానంతర జీవితములేదు, సంతోషమె జీవిత ప్రయోజనము. ఇంద్రియగోచరమగు ప్రపంచమె యథార్థమైనది. ప్రత్యక్ష ప్రమాణమే గ్రాహ్యము. మనశ్శరీరములకు ప్రతికూలము లైన విషయములను తొలగించుటయే సంతోషము. సృష్టి ప్రకృతి కార్యము. విధియనునది లేదు. మానవుని యదృష్టము తనచేతిలో నున్నది" అని ఎపిక్యూరన్ చెప్పేను. అతఁడు అనుమాన ప్రమాణము నమ్మునందువలన జ్యోతిశ్శాస్త్రము (Astronomy) అబద్ధమని భ్రమ పడెను. కరఁగిన 45