పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

39


యనియు, పరిణామవాదులు బోధించుచుండిరి. ఇట్టి క్రొత్త ప్రాంతల సంధి సమయమున విద్యావంతుల చిత్తములు సంశయగ్రస్తములయి చంచలములయి అభినవ సందేశము కొఱకు నిరీక్షించుచుండినవి. ఇట్టి అనుకూల సమయమున ఖయ్యాము రుబాయతు పాశ్చాత్యవాజ్మ యమున నవతరించినది. దానీయందు అభినవ వైజ్ఞానిక భావములు ప్రతిఫలించునట్లు పొడకట్టినవి. కోవుననే రుబాయతు కంతటి వ్యాప్తి కలిగినది. యందు అను మానవులందు జ్ఞానమంకురించినది మొదలు “నేనెవ్వఁడను? ఎచ్చటనుండి వచ్చితిని? ఎచ్చటకు పోవుచున్నాను? మరణమే నా స్థితికి అంత్యమా లేక మరణానంతర జీవితముకలడా? మానవకోటి ఇట్టి వివిధత్వమునకు వివర్యాసమునకు కారణములేమి? సృష్టికర్త యొకఁడున్నాఁడా? ఉండిన యేయుద్దేశ్యముతో నిట్టి విచిత్రమైన సృష్టిని గావించుచున్నాఁడు. ఒకడు సుఖింప నేల, మఱి యొక్కడు దుఃఖింపనేల?” నిట్టి ప్రశ్నలు, విచారములు, సంశయములు పొటమరించుచుండెను. నాఁటినుండి నేఁటివలకు ఇట్టి ప్రశ్నలడుగఁబడుచున్నవి. సమాధానములు చెప్పఁబడుచున్నవి. ఒక్కొక్క దేశమున ఒక్కొక్క కాలమున ఒక్కొక్క మతమును ఇటువంటి సమస్యల చిక్కు విడదీయ ప్రయత్నించినది. అయినను ఈ ప్రశ్నలు సందేహములు అనుదిననవ్యములై చిరంతనములై వివేక వంతుల బుద్ధిపరిశ్రమకు హేతువులై, నీకృత్తములయ్యు రావణుని శిర స్సులవలె మరల మరల పుట్టుచున్నవి. తన పుట్టుపూర్వోత్తరములు దెలిసికొను నిచ్చ ప్రతి మానవునకును సహజముగ నుండును. ఇట్టి విషయములనే ఖయ్యాము తన రుబాయతున చర్చించియున్నాండు. ఇయ్యాము మత విశ్వాసములు. సూఫీ మత పరిభాషలో ద్రాక్షాసవము బ్రహ్మానందమునకు సంకే తము, ఖయ్యాము కొలమునాఁటికి సూఫీ మతము బాగుగ వ్యాపించి యుండెను. సూఫీ'లు లౌకిక భోగములు త్యజించి దారిద్ర్యము నను