పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38


నారయుదము, వ్రాయఁబడిన కావ్యముకాదు. అప్పుడప్పుడు వివిధ మనఃస్థితులలో వ్రాయంబడిన పద్యసముదాయమందు భావసామ్యముగల పద్యము లుండుట అసహజముకాదు, భాషాంతరీకరించువారు ఈ లోపమును గుర్తించి భావములను ఏర్చి కూర్చుట అత్యావశ్యకము. ఖయ్యాము రుబాయతు తేనెతెట్టె. ఫిట్ థైరాలు ఆంధీకరణము తేనెనింపిన గిన్నె. ఖయ్యాము - యూరపు పాశ్చాత్యదేశములలో, అందు ముఖ్యముగా ఇంగ్లీషు మాతృ భాషగానుండు దేశములలో ఖయ్యాము రుబోడుతు ఇంతటి అపూర్వ వ్యాప్తినొందుటకు హేతుభూతములైన పరిస్థితుల పదునెనిమిదవ శతాబ్దిని పాశ్చాత్య దేశములందు విజ్ఞాన ప్రబోధమంకురిం చినది. శాస్త్రవ్యాసంగమును పరిశ్రమలకృషియు ప్రారంభమాయెను. ఆవిరియంత్రము నిర్మింపబడిన వెంటనే పారిశ్రామిక యుగము అవ తరించినది. ఫా'రడి (Farady) అను విద్యుత్తత్వ శాస్త్రజ్ఞుడు ఈ శతాబ్ది అంతమున జన్మించెను. పంతొమ్మిదవ శతాబ్దియందు విద్యుచ్ఛక్తి యంత్రములు నిర్మింపఁబడినవి. వానిమూలమున పరి ప్రవర్థమానములగు చుండెను. డార్విన్, పాక్ స్లీ, సైన్ సరు మున్నగు శాస్త్రజ్ఞులుద్భవించి సృష్టితత్త్వ విచారముగావించి పరిణామ సిద్ధాంతమును వెల్లడించిరి. ప్రజలయందు పరచింతకంటే ఐహిక చింతయే హెచ్చినది. హేతువాదము ప్రబలినతోడనే విశ్వాసము నశింపఁజొచ్చెను. ప్రకృతి శాస్త్రములకు విరుద్ధములైన పురాణమతముల పునాదులు సడలనారంభించినవి. సృష్టికర్త యీ విశ్వమును ఆరుదినములలో సృజించి ఏడవనాఁడు విశ్రాంతిగానే నను బైబిలుసూక్తి హాస్యాస్పదమాయెను. క్రైస్తవమతముపై విశ్వా సన్నగిల్లుచుండెను. విద్యావంతులకు ప్రకృతిశాస్త్రముల పై ఆదరణము హెచ్చుచుండెను. స్వర్గనరకములు భావనాకల్పితముల నియు భౌతికశాస్త్రము నశించిన వెనుక ఆత్మ శేషించునని చెప్పుట ఉత్త కల్లయనియు, దైవమున కారోపింపఁబడిన శక్తులన్నియు ప్రకృతివే శ్రమలు దినదిన సము