పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

37


నాగర పోయినవి. ద్వితీయ సంస్కరణము ప్రకటింపఁబడునప్పటికి ఖయ్యాము పేరు పాశ్చాత్య దేశములలో అందు ముఖ్యముగా ఇంగ్లాండున ప్రతిధ్వనింపసాగెను. అణావరకు ఖరీదు తగ్గింపబడిన 36 పుటల గ్రంథము తుట్టతుదకు 16 రూపాయలకు వెలపోయినది. అమెరికా దేశమందు ఈ తర్జుమాను మొరాకోచర్మముతో బైండుచే యించి బైబిలు గ్రంథమువలె నారాధించుచుండిరి. ఉమ్రఖయ్యాము సంఘములు స్థాపింపఁబడినవి. రుబాయతు చదువుట యొక కొచారమైనది. ఖయ్యామె బ్రతికి యుండినయెడల తన రుబాయ తుకు కలిగిన లోకవ్యాప్తికి తానే ఆశ్యర్యపడి యుండునేమో! ఫిట్ థైరాల్డు తర్జుమా ప్రజాదరణ పొత్రమలు లక్షలకొలది పుస్తకములు వెలపోవుచుండుటవలన మణికొందరు ఆంగ్లేయులు రుబాయతును ఆంగ్లీకరించిరి. కాని కళానైపుణ్యమునందును కవితా మాధుర్యము నందును అవి ఫిట్ బ్లెరాల్డు తర్జుమాకు సరిరావు. ఆతని కృతి మక్కికి మక్కి అనువాదముకొక మాతృకయందలి రమణీయములును సున్నితములునునైన భావములను ఏర్పరచి -స్వతం త్రముగ సృజింపఁబడిన మనోహర పద్యకావ్యము. కావుననే ఆ పద్యములలో చాలవజకు, మాతృకలలో ఏ రుబాయీకి, ఏ పర్యము వ్రాయఁబడినదో తెలిసికొనుటకు వీలుకాకయున్నది. కొన్ని రుబాయీ లలోని భావములను ఏర్చి కూర్చి యొక పద్యముగా వ్రాసితినని ఫిట్స్ఆరాలు తన జాబులలో తెలిపియున్నాఁడు. పారసీక కావ్య ములలో పునరుక్తులు కుప్పతిప్పలుగనుండును. ఈ దోషము “సెమి టిక్' భాషాకావ్యములకు సహజముగనున్నది. ఖురాను ఆంగ్లీకృతికి ఉపోద్ఘాతము రచించిన మార్గోలియత్ (Margoliouth) అను ప్రాచ్య భాషా పండితుఁడు ఇట్లు వ్రాసెను: “సెమెటిక్ మనస్తత్వమునకు సహజమగు పునరుక్తి దోషము ఖురానునందు ఉత్ప్రేక్షించంబడినది.” ఖయ్యాము రుబాయతునందుకూడ ఈ దోషము విచ్చలవిడిగ వ్యాపిం చినది. కాని, యిందుకు కారణము కలదు. రుబాయతు ఏకధారగా