పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33


రాశియు 'హెచ్చగునేని అది యింకను శ్రేష్ఠమే. ఒక శతకమును రచించి మయూరుఁడు గొప్ప కవియని అని పించుకొనెను. ఒక 'యెలిజి' వల్లనే థామస్ గ్రే యను ఆంగ్లేయకవి ప్రఖ్యాతుఁడయ్యెను. 'భాషో' అను జపానుకవి కొన్ని 'హోక్కు' పద్యములను (మన ద్విపదకంటెను చిన్నవి) వ్రాసి ప్రసిద్ధుఁడాయెను. ఖయ్యాము ఒక పద్యము వ్రాయకుండినను తనకీర్తి విజ్ఞాన ప్రపంచమున శాశ్వతముగ నుండదగియు నేఁడు అతని కీర్తి యంతయు రుబా యతు వై నాధారపడియున్నది. 'సత్కవితా యద్యస్తి రాజ్యేన కిమ్మ సెడు భర్తృహరిసుభాషితమున ఎంత గభీరసత్యమిమిడియున్నది! పురా తన పాంథశాలయగు నీ ప్రపంచమున బహరాం జమిషీడులవంటి పాదుషా లెందతో కొన్ని యేండ్లు కాలూని, గతించిరి. రాజ్యముల హద్దులు మాటనవి, ప్రపంచ బహిఃస్వరూపమే మాఱినది. అట్ల య్యును కవితాను ప్రాణితమైన ఖయ్యాము యశశ్చంద్రికలు నేఁడు నానాదేశముల వ్యాపించి హృదయాహ్లాదకరములై విలసిల్లుచున్నవి.


ఒకటి రెండు విషయములఁదప్ప తక్కిన యన్నిటియందు ఖయ్యా ముతో సరిపోల్చతగినవాఁడు ఆంధ్రకవులలో ఒక్క వేమనయే యగపడుచున్నాఁడు. ఖయ్యాము భోగి, వేమన యోగి. ఖయ్యాము శాస్త్రోపాసకుఁడు, వేమన ఆత్మసాధకుఁడు. ఆయనది రక్తి మార్గము, ఈయనది విరక్తి మార్గము.


పారసీ పండితులు ఖయ్యాము నవగణించినట్లే ఆంధ్ర పండితు లును వేమన్నను కవిగ లెక్కింపలేదు. ఏలయన, వేమన అష్టాదశ వర్ణనములు గలిగినాయికానాయకుల శృంగారచేష్టలకు ఆకరమైన యొక ప్రబంధమును వ్రాసియుండలేదు. రసహీనమైన శబ్దాలంకార భూయిష్ఠమయి బంధగర్భ కవిత్వములతో బచ్చెన బొమ్మలవలె కను పట్టు నిర్జీవకావ్యము రచించినవానిని సైతము గొప్పకవియని పండి తులు సన్మానింతురు; కాని, నిరాడంబరమయి సహజసౌందర్యము కలిగి సూటిగా ప్రజల హృదయములోనికి ప్రవేశింపఁగల ముచ్చట