పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29


తప్పకుండ కావ్యమునకు అనుసరణీయములైనవి. ఖయ్యామునంటి స్వతంత్రభావులు, హేతువాదులు ప్రాణాపాయ స్థితియందుండిరి. ఖయ్యాము తన అపర వయస్సును ఇట్టి మతసాంఘిక రాజకీయ దుఃస్థితిలో గడుపవలసి వచ్చెను. వీరభ డ్రా చెడ్డి స్వర్గస్థులయి రెడ్డిరాజుల యాశ్రయము తొలఁగిన వెనుక కవిసార్వభౌముడు శ్రీనాథుడు "కాశికాచిశ్వేశుఁగలసె వీరారెడ్డి రత్నాం బరంబునే రాయుండిచ్చు సను పద్యమున తన హృదయ తాపమును వెలిపుచ్చినట్లు ఖయ్యాము కూడ తన దుస్థితి నిట్లు చెప్పుకొనెను.


మనమున కెక్కినట్టి యజమానులు మిత్రులు, జెల్లినారు;యౌ
వనమధుమాసముం గుసుసభారమురాలిచిపోయె జీవితం
బను సరకంబునందు నడుగంటే మధూళియు నేదినంబు ప
చ్చెనొ మఱియెప్పుడేంగెనో. దీపింపడు హర్షమిహంగ మిప్పుడున్

.

పూవులకారు. రాకలకుం బోయెడి సీతులకున్ రసోజ్జ్వల
జీవిత కావ్యషత్రములు తెచ్చెఱంద్రిప్పితి శోకస్ర్పద
ష్టావిలమౌ హృదంతరము నాసవమున్ బ్రతియోగ మొక్కటే
కావ సమర్థ; మింక ముది కాయము బేతగిలంగ ద్రావెదన్

.

అయ్యో ఖయ్యాము ము తన దుఃఖమును పానపాత్రయందు ముంచి వేయ దలంచెను, అతడు పూర్వాచార పరాయణుఁడుకాఁడనియు, మహమ్మదీయు మతాచారముల పాటించుట లేదనియు ఒక పదంతి ప్రజలలో వ్యాపించెను. ఇస్మాలియాలు తన ప్రాణమున కెప్పుడు ఎసరు పెట్టెదరో యుని తలచి ‘హాజీ' యనిపించుకున్న ఇట్టి యాపద తప్పించుకొన వచ్చునని ఖయ్యాము మక్కా యాత్ర చేసెను. కాని పవిత్రమైన 'కాబా' ఆతని భక్తి వినమ్రుని కావింపలేదు. తిరిగి వచ్చినప్పుడు ఇట్లు చెప్పెను: