పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

మన ప్రియజీవితంబు కుసుమంబుల పోలికలకుం జంచలంబు గావున బువులట్లు కాలమును బుత్తము నవ్వుట పాటలన్ గొనగొనంబాటు కాలువల కోవలుం దియ్యని పానమూని జీవన భరణ ప్రయాస మొక దక్కరు యిప్పుడనే మోస్ ప్రేయసీ.

ఖయ్యూము అపర వయస్సు

ఈ లోకమున నెవ్వనికిని కాల మొక్కరీతిగ గడవంబోదు" మానవుని యుదృష్టము. చక్రనేమి క్రమముగా . తిరుచుండును; హెచ్చుతొచ్చులు మానవ జీవితమునకు సహజములు, పండితులు, పామరులు, రాజులు, రయితులు, కలవారు లేని వారు, అందరును, ఈ న్యాయమునకు బద్దులై యుందురు. ఖయ్యాము సుఖము స్వచ్చము భగ్నమైనది.


ఖయ్యామునకు మిత్రుడును ప్రధానామాత్యుండునగు నిజుముల్ ముల్కు క్రీ. 3. 1092 వ సంవత్సరమున “ఇస్మయీలియాలచే 4[1] హత్య కావింపబడెను. తర్వాత కొలంది కాలమునకే చులక్ షాహియు భూగర్భమున పవళించెను. రాజ్యమున అంతఃకలహములు, పిప్లవములు చెలరేఁగినవి, సెల్ జూకు సామ్రాజ్యము విచ్ఛిన్నమైనది. ఖురాసాను, ఈరాకు విభక్త మైనవి. సిరియా, కెర్మన్ రాష్ట్రములు సామ్రా జ్యము నుండి విడిపడినవి. పుట్టగొడుగులవలె ఊరు వేరులేని రాజులు బయలుదేరిరి. అన్ని విధములైన స్వాతంత్ర్యములు అడుగంటినవి. ఇస్మయీలియాల దౌర్జన్యము నానాటికి హెచ్చుచుండెను. సెల్ జూకు రాజ్యమున దాగియుండిన మూఢభక్తి, అజ్ఞానము, మతపాషం డత్వము, నేఁడు మరల తల చూపినవి. ఖురాను ధర్మములు తు.చ.


.

  1. 4 నిజాముల్ ముక్కునకును ఉమఖయ్యామునకును సతీర్థ్యుఁడయి వారితో ఒప్పుదల కాచించుకోన్న సన్ బెన్ సబాహు ఇస్మయీలియాల సంఘమునకు నాయకుండు. ఇది యొకమత రాజకీయ సంఘము. ఇస్మయాలి యాలను "హంతకు” అని చరిత్రకారులు పేర్కొనియున్నారు