పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
25

మలిక్ షా పొరశీక చరిత్రమున ప్రసిద్ధుడు. అతనికి జలాలుద్దీన్ అని మఱియొక పేరుండెను. జలాలీశకము అతని రాజ్యకాలమున, అనగా క్రీ. వె. 1079 మార్చి 15 వ తేదీన ప్రారంభింపంబడెను, ఉమర్ ఖయ్యాము మలిక్ షాచే స్థాపియబడిన జ్యోతిషాలయము నందు ప్రధాన జ్యోతిష్కుడైయుండి పంచాంగమును సంస్కరించెను. నిజూముల్ ముల్కు గొప్ప విద్వాంసుఁడు; నీతివేత్త. ఈతఁడు మలిక్ షా కొరకు 'సియాసత్ నామా' యను ప్రసిద్ధమైన పాలసా శాస్త్రమును రచించి పాదుషా పేరు ప్రతిష్ఠల చిరంజీవము కావించెను. నిజాముల్ ముల్కు మంత్రిత్వ కాలమున క్రొత్త పట్ట ణములు నిర్మింపబడినవి. ప్రాంత పట్టణములు శృంగారింపబడినవి.. కళాశాలలు నెలకొల్పఁబడినవి. వేయేల, ప్రజలు సంపన్నులై అభివృద్ధి నొందిరి. భోగములు, కళలుపెంపొందెను. భావస్వాతంత్ర్యము ప్రజలెను. మఱియొకమాటు పొరసి రాజభాషయైనది. దేశమున శాంతి నెలకొనినది. ఇట్టి అనుకూల పరిస్థితులలో ఈ ఉమర్ ఖయ్యాము బాల్యయౌవనములు సుఖముగా గడచిపోయెను.

ఖయ్యాము పాండిత్య విశేషములు

ఖయ్యాము బాల్యము బల్షలో గడచెను.ఆతనికి బాల్యము నుండియు గణితశాస్త్రమునందు ప్రీతియు, నైపుణ్యము హెచ్చుగ నుండెను. జ్యామితి, అక్షరగణితములందు ప్రవీణుఁడయి జ్యోతి శ్శాస్త్రము నభ్యసించెను. ఈ శాస్త్రమునందు సమకాలికులలో ఎవ్వరును ఖయ్యామును మించినవారు లేరంట! పంచాంగమును సంస్కరించుటకు మలిక్ షా ప్రసిద్ధ జ్యోతిష్కులను సమావేశపర చినపుడు ఖయ్యాము వారికి నాయకుండయి ప్రశంసనీయముగ ఆ కార్యము నెరవేర్చెను.


ఖయ్యాము అరబ్బీ భాషలో అక్షరగణితమును రచించెను.ఆ గణితము చాలాకాలము వఱకు , ప్రమాణగ్రంథముగ పరిగణింపఁబడు

పటి