పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

నొక సంవత్సరముగ నుండవచ్చును. ఖయ్యాము సంపూర్ణనామము గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఉమ్రాబిన్ ఇబ్రాహిమ్. తఖల్లున్ నామము (Pen-name) ఖయ్యాము. పారసీకులు తమ పేరులకు తండ్రి పేరును జోడించుకొందురు. అందువలన ఖయ్యాము తండ్రి పేరు ఇబ్రహీమని తెలిసికొన వీలైనది.


పారసీక కవులందఱును తఖల్లున్ నామము పెట్టుకొనుట సామా న్యాచారమై యుండినది, ఫి'ర్ దౌసి, హాఫిజ్, అతారి, సోది, జామి అనునవి యిట్టి మారు పేరులే. సంస్కృత కవులలోకూడ రత్నఖేటుఁడు, కోటిసారుఁడు, భవభూతి అను మారు పేరులుగల కవు లుండిరి. ఇటువంటి లాంఛనములనుబట్టి వారివారి వృత్తులు నిర్ణయింప సాహసించుట చూడ బేకర్, బార్బర్, స్మిత్ అను పేరులుగల ఆంగ్లే యులందఱు ఆయావృత్తులకు సంబంధించినవారని చెప్పినట్లుండును. అయినను పారసీకపోజ్మయ చరిత్రకారులు కొందఱు, అతారి అత్త రమ్ము చుండెననియు, ఖయ్యాము.2 [1]డేరాలుకుట్టుచుండెననియు,


దొరకినది. దానిని బట్టి రోతారుగారు ఖయ్యాము జన్మదినము నిర్ణయిం చుటయేగాక, లగ్నకోటినిగూడ తయారుచేసిరి.

1048 మే నెల 18 వ తేదీన సూర్యోదయ కాలమున జన్మము. లగ్నము మిధునము. రవి, బుధ, శుక్రులు లగ్నమందున్నారు. ద్వితీయ మున చంద్రుడు. పంచమమున రాహువు. అష్టమమున శని. నవమమున గురువు. ఏకదశమున కేతువు. ద్వాదశమున అంగారకుడు. జన్మాది 1064-2- 24 తేది వఱకు గురుదశ,


ఇంతకన్నను ప్రబలమైన ఆధారము దొరకువఱకు ఈ నిర్ణయమె సత్యమని తలంపవచ్చును. సర్, ఇ.డి, రాస్ మహాశయుడు ఖయ్యాము జన్మ సంవత్సరము 1040 అనియు, సయ్యద్ సులేమాన్ నద్విగారు 1048 అనియు ఇదివరకు నిర్ణయించి యుండిరి.


2

  1. ఖయ్యామునకు పూర్వమె ఖయ్యామను పేరుగల కవులు పండితులు