పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమఖయ్యాము


పారతంత్ర్యమువదలి పారసీక జాతీయజీవనము పూర్ణవికాసము చెందియున్న కాలమున, ఉమ్రఖయ్యాము నిషాపూరున జన్మించెను. అప్పటి నిషాపూరు శిథిలమైనది. ఇప్పటి నిషాపూరు వేఱు. ఈతని జన్మసంవత్సరము ఫలానీదని నిర్ణయించుటకు తగిన సాధకములు లేవు.1[1] క్రీ.వే. 1015 మొదలు 1035 లోపల నేదియైన

1

  1. హైదరాబాదు దొరతనమునందు ఆర్థికశాఖలో ఉద్యోగిగా నుండిన వి.యం, దాతారుగారు. (ఇప్పుడు సన్యసించి గోవిందతీర్థ స్వాములవారని పేరు పెట్టుకున్నారు.) కొంతకాలము ఉమ్రఖయ్యాము జీవితమును గురిం చియు అతని కృతులను గురించియు పరిశోధన సలిపిరి. అట్లే జర్మనీలో ఖయ్యాము కృతులను గురించి పరిశోధన చేయుచున్న డాక్టరు రెంపి సుగారితో ఉత్తరప్రత్యుత్తరములు జరిపిరి.పరిశోధనకు ఫలితముగా వారు 1941 వ సంవత్సరమున "The Nectar of Grace" అను పేరుతో 1030 పద్యములుగల రుబాయతును, ఒక పెద్ద యుపోద్ఘాతముతోడ ప్రకటించిరి. ఈ పద్యములలో షుమారు 700 పద్యములు ఇతర పారకవుల గ్రంథములలో కానవచ్చుచున్నవనీ దాతారుగారును ఇతర పరిశోధకులును నిర్ణయించిరి. ఆ యుపోద్ఘాతమునందు విడదీయబడిన చిక్కులలో ఖయ్యాము జన్మదిన నిర్ణయము ముఖ్యమైనది. జహరుద్దీన్ అబుల్ హసన్ బైపాకీ రచించిన “పారసీక తత్త్వవేత్తల జీవిత చరిత్రములు" అను గ్రంథ మునందు ఖయ్యాము జన్మదినమును తెలిసికొనుట కొక యాధారము