పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11


మతము) తలచూపినది. భావికవితా విజృంభణమునకు పోషకములగు పరిస్థితులు, సన్ని వేశములు ఈ శతాబ్దియం దొనగూడినవి.

పదియవ శతాబ్ది పారసీక కవితాలతకు వసంత సమయము. జాతీయ జీవనమున నూతన ఘట్టము. మహమ్మదు గజ్నవి రాజ్య పరిపాలనమున లలిత కళలు, శాస్త్రములు, భోగభాగ్యములు సర్వతో ముఖముగ వ్యాపించినవి. స్వభాషపై అరబ్బీ భాషకుగల ప్రభుత్వము జాతీయాత్మ గౌరవమునకు లోపమని దీర్ఘ దృష్టులగు కొందరు పండి తులకు, కవులకు తోచినది. మృదుమధుర శబ్దసంపన్నమగు పారసీ పదజాలమడుగంటి అరబ్బీ పదములు వాని స్థానము నాక్రమించుట అసహ్యముగ కనుపట్టెను. మణిప్రవాళ భాషను త్యజించి పరిశుద్ధమగు తమిళ్ భాష నుద్ధరించవలయునను ఉద్యమ మిప్పుడుదక్షిణదేశమున పొడచూపినట్లు “శుద్ధపారశీ” యుద్యమము బయలు దేరినది. పూర్వ పొరశీక ముపై కవుల దృష్టి మరలినది. పూర్వవీరులుజాతీయజీవన హృద్దర్పణమున ప్రతిఫలించిరి. ఫిర్ దౌసి మహాకవి యీయుద్యమమునకు నాయకుడు. స్వభాషాభిమానముతో “జాత్యముగామి నొప్పయిన సంస్కృత మెయ్యడఁజోన్స" నని తిక్కనమహాకవి నిర్ణయించుకొని ఆ దృష్టితోనే భారతమంతటి గొప్ప యితిహాస ప్రబంధము నిర్వహించి ఆంధ్రుల కృతజ్ఞతకు పాత్రుఁడయ్యెను.[1] ఫిర్ దౌసి యింతకంటెను దారుణమైన దీక్షవహించి శుద్ధపారసీ భాషలో షానామావంటి బృహదితిహాస ప్రబంధమును రచించి పారసీక జాతిని ఋణబద్ధము గావించుకొనెను.


ఫిర్ దౌసీచే ప్రారంభింపఁబడిన శుభాషోద్యమము కొంతకాలమునకు నశించెను. ఇందుకు ప్రబలకారణము గలదు. పారసీకులు మహమ్మదీయులైరి. వారి ముఖ్య మత గ్రంథమగు ఖురాను అరబ్బీ

'

  1. in particular from that school of Indian philosophy known by the name of Vedanta" Von Kremer, (Literary History of Persia by E.G. Brown)