పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

10 సమ్మిళితములైనవి.పారసీక జాతీయజీవన ప్రభాతము దేశ మునావరించి యున్న గాఢాంధకారమును పటాపంచలు గావించెను. ఖురాసాను రాష్ట్రమున జాతీయోద్యమము తలచూపి నలుదిక్కులకు ప్రసరించెను. కాలార తిరుగనేర్చిన బిడ్డ యెంతకాలము దాది నిర్బం ధమునకు లోంగియుండును? పరాయి రాచకము జాతీయజీవన వికాసమునకు ప్రతిబంధకమని పారసీకులు తెలిసికొనిరి. అరబ్బుల పై ద్వేషము ప్రజ్వలించెను. రహస్యముగ సంభాషించుచున్నపుడు మహమ్మదును సైతము "అరబ్బీ ప్రవక్త" యని కేరడించునంతటి నిర్లక్ష్యము జనించినది. పారసీకులకు పలుకుబడి హెచ్చినది. ఉమ య్యద్వంశీయ కరీలీఫా'లకు ప్రతిస్పర్థులైన అబ్బాసీదులకు పారసీకులు సర్వవిధ సాహాయ్యములొనర్చి అరబ్బీ పరిపాలనము నామమాత్రా వశిష్టము గావించిరి.'

మెసపొటేమియా, ఆఫ్ఘనిస్థానము, ఖురాసాను రాష్ట్రము అందు పూర్వము బౌద్ధులు, హిందువులు నివసించుచుండిరి. ఇప్పటికిని అచ్చట శిథిలములైన బౌద్ధవిహారములు, విగ్రహములు కనుపట్టు చున్నవి. హిందూ బౌద్ధ మతభావములు అచ్చటచ్చట వ్యాపించి యుండెను. మానవుని సుఖదుఃఖములు విధినిర్ణీతములనియు పునరా వృత్తి, అవతారములు, ఈశ్వరుని సర్వవ్యాపకత్వము, సర్వాంతర్యామి త్వము, అగ్ని నుండి విస్ఫులింగములు బయలు వెడలినట్లు ప్రాణికోట్లు సర్వేశ్వరు నుండి వెలికుతికి యెప్పుడైన నొకప్పుడు నైక్యమగునను నిట్టిభావములు, విశ్వాసములు పూర్వ పారసీకులందు వేళ్లు కొనియుండినవి. పారసీకమున ఇస్లాముమత మిట్టి యన్యభావములతో సమ్మేళించి నూతనాకారముఁ దాల్చెను. ఇట్టి పరస్పర సమ్మేళనము నకు ప్రతిఫలముగ తొమ్మిదవ శతాబ్దియందు2[1] వేదాంతము {సూఫీ '

2

  1. *That Sufism proper, as it finds expression in the different Dervish orders (which I sharply distinguish from the simple ascetic aim which already appeared in the earliest Christianity, whenceit passed over to Islam) arose essentially from Indian ideas and