పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9


పదములుండును. వారు వేయి సంవత్సరములు రాజ్యపరిపాలన మొనరించినను ఒక్క క్షణమైన మనతో వారికక్క ఱపడి యుండినదిలేదు. కాని, మనము నూరు సంవత్సరములనుండి రాజ్యము చేయుచున్నను ఒక్కక్షణమైన వారి సొహాయ్యము పొందక తప్పినదికాదు."

బాగదాదు. కలీపు'ల రాజ్యపరిపాలనమున చక్కని అరబ్బీ కవి త్వము చెప్పినవాఱందరు పారసీకులే. కాలక్రమముగ అరబ్బీ పదములు పొరసీక భాషలోనికి యథేచ్ఛముగ ప్రవేశించినవి. ఇప్పుడేదైన నొక పొరసీ నిఘంటువెత్తి చూచినయెడల ఒకటికి మూడుపాళ్ళు అరబ్బీ పదములు పారశీక భాషలోనికి యదేచ్చచ్చగ ప్రవేశించినవి. ఇప్పుడేదైన నొక పారశీ నిఘంటువెత్తి చూచిన యెడల ఒకటికి మూడు పాళ్లు ఆరబ్బీ పదములుండును. ఈ విషయమునందు పారసీకిని తెలుగునకును సొమ్యము గోచరించుచున్నది. గ్రాంథికాంధ్రము, సంస్కృత పురా ణముల యాంద్రీకరణముతో ప్రారంభమైనందున నిరంతరాయముగ సంస్కృత పదజాలము తెలుఁగున ప్రవేశించెను. అట్లే అరబ్బీ పొండి త్యముగల పారసీక విద్వాంసులు కవిత్వపల్లుటవలన అరబ్బీ పదములు విచ్చలవిడిగ పారసీక కావ్యముల నాటుకొనిపోయినవి. పాదాంతాక్షర నియమముగల పారసీక కవిత్వమునకు అరబ్బీ పదజాలము మఱింత సౌలభ్యము చేకూర్చినది.

అరబ్బీ దండయాత్రకు పూర్వము పారసీకమున కవిత్వములే దని చెప్పుదురు. వాల్మీకి మహాకవికి పూర్వము సంస్కృతమునను, నన్నయకు ముందు తెలుఁగునను కవిత్వములేదని చెప్పునట్లు ఇదియు నొక వివాదాంశము. ఈ విషయమున పారసీక వాజ్మయ చరిత్ర కారులు భిన్నాభిప్రాయముల వెలిపుచ్చియున్నారు. కొందఱు క్రీ.వె. అయిదవ శతాబ్దియందు పంచము బహ్రాము ఛందోబద్ధమగు కావ్యము రచించెనని చెప్పుదురు. మఱి కొందరు అబుల్ హాఫ్'స్ ఆదికవి యని యందురు. మెర్వు పట్టణమున అబ్బాసనునతఁడు మామూనును కీర్తించుచు క్రీ. వె. 809 వ సంవత్సరమున ప్రథమ పారసీ కావ్యము రచించెనని మహమ్మద్ ఊఫి' వ్రాసియున్నాడు.

కాలక్రమముగ క్షీరనీరములట్టు ఆర్య, ఇస్లాము నాగరకతలు