పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

వీరులచ్చట నుద్భవించి పరాక్రమనంతులకు గ్రీకులకు ప్రతిస్పర్డులై నిలచిరి. నేఁటికిని భగ్నా వశిష్ట రాజప్రాసాదములు, మంటపములు 1[1]సూస, పెర్సిపోలిసు, బెహిస్తూనులయందు పారసీకనాగరకతను,ప్రాభవమును వేయినోళ్ళ చాటించు చున్నవి.

ఆరవ శతాబ్దియందు మహమ్మద్ ప్రవక్త అరబ్బీ దేశమునందవతరించెను. ఏడవ శతాబ్ది ప్రారంభమున అరబ్బులు పొరసీకమును పరిపాలనముతోడ మహమ్మదీయ మతమును ప్రవేశ పెట్టిరి. భిన్న నాగరికతలుగల రెండు జాతులకు రాజకీయ సాంఘిక సంబంధ మొనగూడినపుడు అజ్ఞాతముగ కొన్ని మార్పులు ఇరుతెగల యందును పొడకట్టుచుండును. అయినను బలవీర్యములుగల జాతి ఆచారవ్యవహారములు బలహీనులకు అనుకరణీయములగు చుండును. నిర్జితులైన పారసీకులు మహమ్మదీయ మతమును స్వీకరించిరి. సమ్మ తింపనివారు ఇతరదేశములకు వలసపోయిరి. ఇప్పటి మన పార్సీలు అట్లు వలస వచ్చినవారే.


అరబ్బీ రాజభాషయైనది. పండిత సభలయందు, రాజాస్థానము లయందు అరబ్బీ వ్యవహరింపఁబడుచుండెను. అరబ్బీ , కవిత్వము, శాస్త్ర గ్రంథములు క్రొంక్రొత్త లగుటవలన పారసీకుల చిత్తముల సాక ర్షించినవి. "అచిరకాలముననే పారసీక కులీనులు అరబ్బీ పాండిత్యము నలవటించికొని రాజాస్థానమునందు ఉన్నతోద్యోగముల నిర్వహింప సాగిరి.విజయగర్వ ప్రమత్తులగు అరబ్బులకు పారసీకుల విజృం భణముపై అసూయపుట్టి వారిని నీచముగ చూచుచు సమయము దొరికినపుడెల్ల నిరుత్సాహపఱచుచుండిరి. అట్లయ్యు పొరసీకుల విజ్ఞాన తృష్ణను పొరరికట్టజూలకుండిరి. క్రీ.వె. 715 వ సంవత్సరమునందె ఉమయ్యద్ వంశీయుఁడైన కరీఫా' సులేమాను ఇట్లు వెఱగుపడెనట. “పారసీకుల విజృంభణము నాకు ఆశ్చర్యము గోలుపుచున్నది.


1

  1. వెర్సిపోలీసునందలి సుప్రసిద్ధ శతస్తంభ రాజప్రాసాదమును అలెగ్జాండరుతగులఁబెట్టించెను.