పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సటి సంవత్సరంలో వారి యేడాది శిశువు కుముదమ్మ మరణించింది. ఆ విషాద స్మృతుల నుంచి మరో మలుపుగా 1926లో అక్టోబర్ 5న `పానశాల' అనువాదాన్ని ప్రారంభించారు రామిరెడ్డి. ఆ మరుసటి సంవత్సరం - నవంబర్ 24 తేదీకి అనువాదం పూర్తయింది. ఆ రచన 1928లో ప్రప్రథమంగా `భారతి'లో ప్రచురితమైంది.

1929లో జూన్ 16న రామిరెడ్డి గారికి అన్నపూర్ణమ్మ గారితో రెండవ వివాహం జరిగింది. ఆ సంవత్సరంలోనే ఆంధ్ర మహాసభ (బెజవాడ) వారు ఆయనకు `కవికోకిల' బిరుదును ప్రదానం చేశారు.

1934లో ఆయన `గులిస్తాన్'ను అనువదించారు. `35లో `కాంగ్రెస్ వాలా' అనే నాటకాన్ని రాశారు. `36లో `సతి తులసి' అనే చిత్రానికి రచన చేశారు. ఆ మరుసటి సంవత్సరం `చిత్రనళీయం' అనే చిత్రానికి రచన, దర్శకత్వం నిర్వహించారు. అప్పట్లోనే `వేంకటేశ్వర మహాత్మ్యం' (39), పార్వతీ కల్యాణం, సీతారామ జననం చిత్రాలకు పద్యాలు రాశారు. 1940-44 మధ్య `పళ్లతోట'ను అనువదించి `పలిత కేశము', `కవి-రవి' అనే కావ్యాలు రచించారు.

1945లో ఆయనకు పక్షవాతం వచ్చింది. 1947 సెప్టెంబర్ 11న జీవన పోరాటంలో అలిసిసొలిసి, అంతిమ విశ్రాంతిని తీసుకున్నారు.

రామిరెడ్డి మతం - మానవ మతం. విజ్ఞానవాదం ఆయన ధ్వజం.

`ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ' అన్నారు చలం 1940లో.

                           ``బాధలే నాకాప్త బంధువర్గంబు
                              బీదతనంబె నా ప్రియమైన హక్కు
                              లోకహితంబు నాలోచించు పనియె
                              కఠినంబు విధి - దైవ ఘటితంబు నదియు

అన్నారు రామిరెడ్డి 1935లోనే. నిజమైన కవి లక్షణం అదే. అందుకే ఆయన రచనలు, కీర్తి సాహితీ సీమలో శాశ్వతస్థానాన్ని చూరగొన్నాయి!