పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేయడం, ఇంకొకటి చేసి నెల్లూరు మునిసిపాలిటీకి బహూకరించడం, అందమైన శిల్పాలు రూపొందించి తమ ఇంటికి అదనపు అందాన్ని చేకూర్చడం వంటి పనులు రామిరెడ్డి సన్నిహితులకు ఆశ్చర్యానందాలు కలిగించేవి.

రామిరెడ్డిగారికి 1915లో శేషమ్మగారితో వివాహం జరిగింది. ఆ సంవత్సరమే ఆయనను కవితాకన్య కూడా వరించింది!

ఆయనకు చిన్నప్పటినుంచీ హేతువాద భావాలు. `సాహితీ వ్యాసంగం పూర్వజన్మ సుకృతం' వంటి మాటలు ఆయనకు నచ్చేవి కాదు. `మనిషి ప్రయత్నించితే - చేయలేనిది ఏదీ ఉండదు' అని ఆయన గట్టి నమ్మకం.

ఆ నమ్మకంతోనే తన కవితాకాంక్షకు రూపురేఖలు దిద్దే కార్యక్రమంలో `సులక్షణాసారం', `అప్పకవీయం' పునాదులుగా చేసుకుని, తన భావనా పటిమతో భాషపై అధికారాన్ని చేబట్టి అంతవరకూ కృషీవలుడుగా ఉన్న రామిరెడ్డి సాహితీ కృషీవలుడుగా మారారు!

ఇరవై మూడేళ్ళకే `రసిక జనానందము', `స్వప్నా శ్లేషము', `అహల్యానురాగాలు', `కృష్ణరాయభారము' అనే నాటకం (అముద్రితం) మాతృశతకం రచించారు. `ఋతు సంహారము', `పుష్పబాణ విలాసము' అనువదించారు.

1917లో నెల్లూరులో సి.ఆర్. రెడ్డిగారి అధ్యక్షతన జరిగిన సభలో రామిరెడ్డిగారికి స్వర్ణపతకం బహూకరింపబడింది. 1918లో ఆయన రాసిన `వనకుమారి' కావ్యం విజయనగర మహారాజాస్థానంలో ఏర్పాటు చేయబడిన కావ్యస్పర్ధలో ప్రథమ స్థానాన్ని పొంది, ఐదువందల రూపాయల బహుమతిని గెల్చుకుంది.

ఆ తర్వాత `కృషీవలుడు', `జలదాంగన', `యువక స్వప్నము', `కడపటి వీడుకోలు', `సీతా వనవాసం', `కుంభరాణా', `మాధవ విజయం' నాటకాలు రచించారు.

రామిరెడ్డిగారి జీవితంలో 1925, 1926 సంవత్సరాలు విషాదాన్ని మిగిల్చాయి. 25లో భార్య శేషమ్మ మరణించారు. ఆ మరు