పుట:Palle-Padaalu-1928.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అత్తింటికి

మాబావ వచ్చాడు ఓయి సెల్లూలా
నే నెల్లి వత్తాను ఓయి సెల్లూలా
కొత్త సీరాలెన్ని ఓయి సెల్లూలా
కోబ్బెరా బెల్లాము ఓయి సెల్లూలా
నీటి గుడ్డాలెన్ని ఓయి సెల్లూలా
సిల్కు సీరాలెన్ని ఓయి సెల్లూలా
పైట పావడాలు ఓయి సెల్లూలా
పట్టాడా లెన్నో ఓయి సెల్లూలా
మాబావ వచ్చాడు ఓయి సెల్లూలా
నేనెల్లి వత్తాను ఓయి సెల్లూలా
నన్ను మరువాకండి ఓయిసెల్లూలా
నామాట మరువాకు ఓయి సెల్లూలా
అమ్మ మాటయీను ఓయి సెల్లూలా
అన్నాకి తమ్ముడికి ఓయి సెల్లూలా
అమర్చి పెట్టావే ఓయి సెల్లూలా
ఇరుగు పొరుగోరీతో ఓయి సెల్లూలా
ఇష్టంబుగా వుండు ఓయి సెల్లూలా
పొద్దు ఎక్కక ముందు ఓయి సెల్లూలా
పక్కా నుంచి లెగిసి ఓయి సెల్లూలా
పెతి రోజు గుడికిన్ని ఓయి సెల్లూలా

87