పుట:Palle-Padaalu-1928.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బెలువయిన, పట్టుమేం | పడితిమమ్మా ౹౹జ౹౹
కొప్పుచక్కగబెట్టి ! గొజ్జంగులను ముడిచి
పమిడి, జల్తారు | పట్టుచీర గట్టి
రంగైనరత్నాల | రవికనుతోడిగిన
భక్త పోషిణి మమ్ము | పాలించవమ్మా ౹౹జ౹౹
ఆభరణములు తెచ్చి | అలంకరించినీకు
పసిడిగొలుసులు తీర్చి . బాగుగవేసి.
గంటలొడ్డాణంబు | కన్నతల్లికి పడుగు
కన్నబిడ్డలనుచు | కరుణించుతల్లీ ౹౹జ౹౹
అందముతోనీపను | లమరించినట్లు
తప్పులను బట్టక ! దయనుజూడు
యెప్పుడునీ పాద | యేక సేవ జేతు
యొప్పతో నీవద్ద | నుంచవమ్మా ౹౹జ౹౹

ఆడుపడుచు అత్త వారింటికి కదిలేఘట్టము గృహజీవనములోని సుందర దృశ్యాలలో ఒకటి. ఈ పాటలో అత్తింటికి పొయేబడుచులు పలుకుతున్నది.