పుట:Palle-Padaalu-1928.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవిరేడు మంగళ హారతి

——ఈ రెండవది అవిరేణి పాటయే. తలబ్రాలు పోయించిన తరువాత శిరస్నానాలు వధూవరులకు చేయించి, పెళ్లి పీటలపూద ఆశీర్వచనాలు చేసి, అరుంధతికి మ్రోక్కించి, పేరంటాండ్రతో అవిరేడు వద్దకు తీసుకపోయి వధూవరులచేత ఆవిరేడునకు మ్రోక్కించి ఈ మంగళహారతిని పొడుదురట.

జయమంగళం | నిత్య శుభమంగళం
జయ; జయా! మంగళం ! 'మహోత్సమంగళం ౹౹జ౹౹
దివ్యాంబరములుగట్టి | దీపాల వెలుగున
నవ్వుచూ; మహలక్ష్మి | నాట్యమాడా
యిల వేల్పునీవు | వెలసితివి, మాయింట ౹౹జ౹౹
సిరిగజ్జెలను గట్టి | చిందులు ద్రోక్కుచు
సిరిలక్ష్మి మాయింట | స్థిరముగానూ
యేక చిత్తంబున | యెప్పుడుకలకల
బాయక, భక్తి లో ! నుందువమ్మ ౹౹జ౹౹
మల్లెతోటలోను | మసలుతూ ! మహలక్ష్మి
యెల్లలోకంబులు | యేలుతూనూ
యుల్లాసంబుతోను | యూరుపాలించుచూ
యెప్పుడు, నుప్పొంగు | తుందువమ్మా ౹౹జ౹౹
కనకగద్దెమీఁద | కదలక కూర్చుండి
ఆడిగినప్పుడును నీవు| అభయమిచ్చి
కోరినకోరికలు | కోనసాగింతువని