పుట:Palle-Padaalu-1928.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవి రేణి పాట

జూనపదుల వివాహోత్సవాలలో రంగులతో చిత్రించి అలంకరించిన అవిరేణిఘటమునకు ప్రాముఖ్యత ఎక్కువ. అవిరేణి, లేక అయిరేని—— ఐరేని అనటంకూడా కద్దు —— పాటలు తెలుగునాట విరివిగా ఉన్నవంటారు. మాకు రెండే లభించినవి.

అలికిన పూసిన అరుగులమీద
ఆకుతేలు కుట్టింది నిన్ను బావయ్య
చీపురుకట్టోక చేత దీపమొక చేత
దిగదుడువవచ్చిన చినబావనుకుట్టె
అన్నదమ్ములబాధ తాజూడ లేక
అట్టె పెళ్లి పెదబావ నట్టేటదిగును
కానక వారమ్మ కాలువలో దిగును
ఎరుగక వారి తండ్రి ఏటిలో దిగును
శతమానాలకు వెళ్లిన చేడెలనుజూచి
కంసాలిగంగయ్య కాలువలో దిగును
అవిరేణికి వెళ్లిన అక్కలను చూచి
కుమ్మరి వెంకన్న గుంటలోదిగును
బాసికానికి వెళిన బావలనుచూచి
మంగలిసుబ్బయ్య మంటలో దిగును

ఇది అవిరేణి దగ్గర పాడునట్టి పాటకాదు, అవిరేణిని గురించినపాట అనిపిస్తున్నది.