పుట:Palle-Padaalu-1928.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నంది రెడ్డి

——నంది రెడ్డి కూడా యిటువంటి దుర్మరణము పాలైనవాడే. చందమామ వంటి ఆంద చందాలున్న వాడట. కాంతాలోలు సత్యమే అతని పాటుకు కారణమేమోననిపిస్తుంది, వినండి.

రాజా మానందీ రెడ్డీ
       నీకిలలో బత్తెముతీరెనా
కొడుకా మానందీ రెడ్డీ
       మల్లుపంచె కట్టుకోనీ
నల్ల కోటూ తొడుక్కోనీ
       పల్లెదోవన బోతవుంటే
పాలెగాడను కుంటిరా
       కొడుకా మానందీ రెడ్డీ
కట్టమీదా బోతవుంటే
       కలక టేరను కుంటిరా కొడకా
రాజా మానంది రెడ్డీ
       నీకిలలో బత్తేముదీరెనా
నున్నంగ తలదువ్వి
       నూగాయ జడలేసి
సందు వెంట బోతావుంటే
       సందమామను కొంటిరకొడకా
వచ్చిపోయ్యే దోవలోన
       దానిమ్మ చెట్టుకింద
వెండికుచ్చే నేల బడితే
       ఏటుకేతెగ నరికెనన్నా

73