పుట:Palle-Padaalu-1928.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మల్లన్న పాట

ఓరోరి మల్లన్నా బొమ్మని పాటి మల్లన్నా
పాలోడై పుడ్తివిరా బొమ్మని పాటి మల్లన్నా
పగదారై పుడ్తివిరా బొమ్మని పాటి మల్లన్నా
నీతండ్రి జావంగా నీతల్లి జావంగా
నా సేతు లేసిరిరా బొమ్మని పాటి మల్లన్నా
బండికి కట్టిండూ యల్పటకాడు చంద్రగాడు
దుమ్మేరి పాడదిరా బొమ్మని పాటి మల్లన్నా
బోరు బోరు బొగుడల్లా కాసోడు కొట్టిన
కక్కూసపు రాళ్ళల్ల నీగోరి కట్టిరిరా
బొమ్మని పాటి మల్లన్నా
తాసిల్దార్ కాశేరికీ తాల్కుదార్ బంగళాకు
నీ తజ్విర్ దించిరిరా బొమ్మని పాటి మల్లన్నా

కక్కూసపు రాళ్లతో గోరి కట్టినారట మాయల మల్లన్నకు. అప్పటికి గాని వాని పాపానికి ప్రాయశ్చిత్తము జరుగదు ! [[right|77}}