పుట:Palle-Padaalu-1928.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోలాటం పాట

జానపదుల హృదయము బహు సున్నితమైనది. శౌర్యాన్ని ఆరమర లేకుండా పూజిస్తుంది. ఆవగింజంత అన్యాయానికికూడా సహించదు. కుత్సితుని వీరము కనబడినా కళ్లుమూసుకోదు; వాని ఠీవి, రాజసమూ, ఏదో గుణాన్ని ఎక్కడికక్కడే మెచ్చుకుంటుంది. హంతకుడినైనా సరే చిత్రవధ చేస్తే భరించలేదు. జాలిపాటలు పాడుకుంటుంది. లోకోపకారికి సాష్టాంగము పడుతుంది. తెలుగులో సుధీర్ఘ వీర గాథలు పెక్కులు కలవు. ఇక్కడ ఇచ్చినవి చిన్న రచనలు.

——మొదటిది 'కోలాటం పాట, ఓబుల రెడ్డి కోఫు (ఖండగతిలో నడవటం వింత) పైదళము రాకుండా ఆశ్వకదళాన్ని అడ్డిన దాతని జెండా, తెలుగునాట నిట్టి అజ్ఞాత వీరులు ఊరున కొకరు. హిండేవారు దోపిడి నడిపినప్పుడు మరుట్ల పాళెపు గొల్ల చిన్నమ్మ కొడుకు చిన్నమల్లేశ "కోటకొమ్ము లెక్కి నాడు కోటికూత లేశినాడు, బుజం మింద బల్లెమిసిరి మొలక మీసం దిద్దినాడు.” ఆవీర వంగడములోని వాడే ఓబులురెడ్డి.

కోలు కోలన కోలు కోలన్నా కోలే
కోలు మాయకు బాలనరసింహకోలే
గుట్టగురప్పకొండ గురిదప్పకుండా
పై దళమురాకుండ పడెరానీజండా
సైరాఓబులు రెడ్డి నెలవన్నె కాడా
నినుజూచి నాగుండే జలుజల్లు మనెరా ౹౹కోలు౹౹
నీకుపూలూ నీదుకత్తికీ పూలూ
నీ చేతికీవన్నె బంగారురవలు
ఎర్రాదిగుఱ్ఱము వెండికళ్ళెమురా
దూకించాగుఱ్ఱాన్ని తుమ్మెల్ల రేగ
బూడిదగుఱ్ఱాము బుగడకళ్ళెమురా
బుగడకళ్యాణికి బొండుమల్లెలురా ౹౹కోలు౹౹

వీర పూజలో "తెలుగుజిడ్డ ఎన్నడూ వెనుకాడలేదు, ఏమని తెగనాడుటలోనూ ఆలపింపలేదు.

74