పుట:Palle-Padaalu-1928.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏలకోపు -2

పుట్టమీద పాలపిట్టోయి నాసామి
కోట్టబోతె తేలుకుట్టె అవునోయి
మంత్రపించే జాణలంటే నాసామి
మల్లెమొగ్గ పానుపేరద్దు ఆవునోయి
నేల నేల నెల్లి కూరోయి నాసామి
పొలపాలబలును కూర అవునోయి
వాలుకొమ్మల సింతసిగురోయి నాసామి
వండి పెడితే వలపుతీరు అవునోయి
అరుగుమీద అరటిపండోయి నాసామి
అడగబోతె బహుసిగ్గోయి అవునోయి.
పండుమీద ప్రేమలుంటే నాసామి
పంతగిస్తే పండురాదా అవునోయి
చక్కరాల గుట్టకాడ నాసామి
చెక్క గొట్టే చిన్నవాడ అవునోయి
చెక్కవచ్చి చెంపనాటె నాసామి
చెప్పరాని దుఃఖ మొచ్చె అవునోయి
మంచినీల బావికాడు నాసామీ
మందునూరే సిన్నవాడ అవునోయి
మందులేలా మాకులేలా నాసామి
మాటలాడితె నేను గానా అవునోయి ౹౹

'ఉంగరాల చెయిచూసి, ఉండదేర ముండమనసు', 'ముందటేరు దున్నేవాడు, చెక్క పచ్చి చెంపనాటె, నన్నవి రత్నాల తునకలు. చాలాపాటల్లో మెరుస్తవి. ఈరచయితలు పేరులే పెట్టుకోరు. కాబట్టి కాపీరైటు బాధ లేదు ! ఎవరు సంగ్రహించినా ఆక్షేపణ లేదు