పుట:Palle-Padaalu-1928.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావిడేసుక నువ్వు రారో |చినవాడ|
       కడవబట్టుక నే నెవస్తా ౹౹ఔను౹౹
నీటిమీద కొంగుపఱచి |నారాజ|
       నిద్దురే నీకిచ్చిపోతా ౹౹వా౹౹
కొండమీఁద కొఱ్ఱచేనో |చినవాడ|
       కొఱ్ఱబోతే రెడ్డిసాని ౹౹ఔను.౹౹
రెడ్డిసాని ఱోమ్ముమీద |నారాజ|
       గోగుపువ్వే గొడుగునీడ ౹౹వా౹౹

73