పుట:Palle-Padaalu-1928.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏలకోపు-1

—— ఇవి రెండూ చిత్రమైన పాటలు. వీటి త్రిశ్రగతీ, పాదసంపూర్ణతా వస్తుసంకీర్ణతా రచనా ప్రాగల్భ్యమూ వీటిని కోలాటపు పాటలలో చేర్చటానికి సాయపడ్డవి. వీటిలోని శృంగారమునుబట్టి వీటిని ఏలకోపులంటున్నాము. పోతా ||వా॥

వానేల గురిసెనోరాజో ! నాస్వామి,
       వరదరాజుల ఫువలవాన |ఔను,|
మళ్లి గురిసిన పువలవానో | నాస్వామి,
       మగువ దగ్గిర పేటలోను ౹౹వా౹౹
చీరెల్ల చిత్తారునేతో ! నాస్వామి,
       ఒళ్లెల్ల జవ్వారిపూత |ఔను|
యెల్లయెడ్లను, దున్నువాఁడ |చినవాడ!
       యెల్లుండి నే వెళ్లిపొతా ౹౹వా౹౹
వెళ్లి పోయే చిన్నవాఁడ |నాస్వామి!
       వేళ్ల నిండా ఉంగరాలు ౹౹ఔను౹౹
ఉంగరాలు చెయ్యి చూస్తే |నారాజ!
       ఉండదయ్య, ముండమనసు ౹౹వా౹౹
ముంగటేరు, దున్నువాఁడా ! నాస్వామి ;
       ముత్యాల పోగులవాఁడ |ఔను|
సాలుదప్పక దున్నుతావా |చినవాడ|
       దారిదప్పక నే నెవసా ౹౹వా౹౹

72