పుట:Palle-Padaalu-1928.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరమాన్నం

భూమికి తాళాలేస్తేరంగా
అల్లో భోగం దాడ్తెరంగా
బోగందానికి సవుకం దొరికె
సవురం కొండూపోయీ అమ్మాకిచ్చె
అమ్మాబుడ్డెలు పాలుపోసె
పాలు కుండా పోయి పరవాన్న మొండె
మొగొన్కి పెట్టేరా మొర్రి చిప్పాలో
బిడ్డాకు పెట్టెరా బొడ్డూ గిన్నేలో
అది వెట్టుకొనె యెండీ గిన్నేలో
మొగొన్కి పోసెరా కప్పాల కడుగు
బిడ్డాకు పోసెరా రోయ్యాలా పులుసు
అది పోసి కొనెరా గంగావు నెయ్యి
మొగొన్ని కరచే మొద్దుల్లపొము
బిడ్డన్ని కరచే బెడ్డాల తేలు
దాన్ని కరచే కట్టకింది కాకి
మొగోన్ని దెట్టెరా మొద్దూల కింద
బిడ్డాని పెట్టే బెడ్డల కింద
దాన్ని పెట్టె కట్ట కింది లొట్లె.