పుట:Palle-Padaalu-1928.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముందుమాట

ఏదేశంలోనైనా వాఙ్మయం పాడుకోవడానికీ ఊరికే చదువు కోవడానికీ వీలుగా ఉండడంమామూలు. ఇంత మాత్రానికే గేయ వాఙ్మయమనీ, జానపద వాఙ్మయమనీ పెద్దపెద్ద పేర్లు పెట్టినా, ఎన్ని విధాల మార్పులు చేర్పులు చేసినా ఇవన్నీ కూడా దాన్ని ఉపయోగించుకొనే వాళ్ళను బట్టి ఎచ్చేవేకాని ఆసలు వస్తువులో మాత్రం ఏతేడా కాన్పించదు. చదివినా లేక పాడుకొన్నా ఆసాహిత్యంలోని వస్తువులో ఏ విధాన్నైనా మార్పుకల్గుతుందా ? కల్గబోతుందా ? ఆధివా కల్గిందా ? ఇంకొకటి కూడా మనం బాగా పరిశీలిద్దాం. ఋగ్వేదం ప్రపంచంలోని అన్నిదేశాల్లోని అన్ని భాషల్లోని సాహిత్యం కంటే కూడా చిట్టచివరికి గాధిక్ భాషకన్నా కూడాచాలా వెనకటిదని అందరికీ తెలిసిందే. అందువల్లనేకదా సామవేదంలో పాడడానికి వాడబడేవి చాలా ఋగ్వేదంలో ఋక్కులేఅని అంటారు. అయితే ఈ పాటలు పాకృతజనుల వాడుక మాటల్లో ఉన్నవికదా ! ఋగ్వేదాదులట్లాలేనే అని సందేహిస్తారా? చూడండి ఋగ్వేదాదులు కూడా ప్రాకృతంలోనే తెనుగువాడైన దండి మహాకవి ఈ విషయాన్ని తెగేసి చెప్పినాడు.

"సంస్కృతం నామ దైవీ వాగవ్యాఖ్యాతా మహర్షిభిః " అని కొన్నాళ్ళకు పాణినిలాంటి మహాఋషులు వెనుకటి కాలపు మొదటి ప్రాకృతాన్ని అనగా ఋగ్వేదాదుల్లోని భాషను సంస్కరిస్తే సంస్కృతం అయిందట. ఈ విచారమంతా ఎందుకయ్యా అంటే సాహిత్య మంతా గేయంగానూ లోకుల వాడుక భాషల్లోను గూడా ఉండదగినదే అని చెప్పడానికి,

అయితేకొన్ని అట్లాఉండనివిగూడా లేకపోలేదు. మచ్చుకి జయదేవుడి అష్టపదులు చూడండి. అవి అప్పుడు వాడుకలో లేని సంస్కృతంలో రాసినవే. అవి అర్థంలో ఎంత అందంగా ఉన్నా శబ్ద స్వరూపంలో లోకులకు అందకుండా పోయింది. కనుకనే పకృతంలోని యీ పాటలు ఏనాడు ఎవరు' 'చెప్పేసవోగాని అవి యెవ్వరి ప్రయత్నమూ అక్కర లేకుండానే ఇంత కాలంవరకూనిల్చి వున్నవి. లోకుల నోళ్ళలో