పుట:Palle-Padaalu-1928.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెఱకు పంట కోపు

సైరా నాగానిగిల్లా, ఇట్ల నరకలోక మేలేటి
నా ముద్దుగానిగా
కొత్త కోటోళ్ళోచ్చి కొలత బెట్టించిరి
గుండ్లూరు వారొచ్చి గుర్తు బెట్టించిరి
బారాల వారొచ్చి సెఱకు నాటేసిరి ౹౹ సైరా౹౹
బోడరెడ్డి పల్లెవారు బోడసాలు తీసిరి
అంగుతోట పల్లెవారు ఆకుసాలుతీసిరి
నుట్టుపట్టు వారొచ్చి సుట్టేసిపోయిరి ౹౹ సైరా॥
గుడియాత్తం వారొచ్చి గూటలునాటిరి
వారపు కొండకుపోయి వాసాలు తెచ్చిరి
నీతలకు తగలకుండా దండాలుకట్టిరి ౹౹ సెరా౹౹
గానుగింట్లో ఆ సెరకు గెజ్జ వాగినట్లుంది
కరణంకాడ ఆ సెరకు కంచు వాగినట్లుంది
పంట పంట సక్కెరాయే వాకుదప్పిన బెల్లమాయె
రాయల్ పేట వర్తకులు రంగు లేదనిరి
చౌడేపల్లివారు సరకు బాగనిరి
పలమనేరువారు పైకమిచ్చిరి
పిచ్చయ్య చేతిలో పచ్చనోట్లు
నీచేత నాచేత పచ్చిపోకలు ౹౹సైరా౹౹

చివరకు మిగిలేది పచ్చిపోకలు |

66